జ్ఞానవాపి కేసులో కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది. జ్ఞానవాపి వ్యాసాజీ బేస్‌మెంట్‌లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్ జిల్లా డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఇరువర్గాలు వాదనలు విన్నది. కోర్టు బుధవారం కీలక తీర్పును వెల్లడించింది. బేస్‌మెంట్‌లో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది.కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్‌ను తెరిచేందుకు అనుమతించాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు 1993కి ముందు తరహాలోనే బేస్‌మెంట్‌లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున ముంతాజ్ అహ్మద్, ఇఖ్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేసింది.బేస్‌మెంట్ మసీదులో భాగమని స్పష్టం చేశారు.
అక్కడ పూజలు చేయడానికి వీలు లేదన్నారు. బేస్‌మెంట్ మసీదులో భాగమని, అది వక్ఫ్‌బోర్డు ఆస్తి అని పేర్కొన్నారు. అక్కడ పూజలు చేయకూడదని వాదించారు. అయితూ, ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హిందూపక్షం న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు అన్నారు. పూజలకు ప్రతి ఒక్కరికీ హక్కు ఉందన్నారు.