ycp mla-nallapa reddy prasanna kumar
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

చంద్రబాబుకు అమ్ముడుపోయిన షర్మిలమ్మ..

నారా చంద్రబాబు నాయుడు దగ్గర 200 ల కోట్లు ప్యాకేజీ తీసుకుని అమ్ముడు పోయావని కోవూరు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా  ఆయన శనివారం
 బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టారు. దామరమడుగు, కాగులపాడు,నాగమాంబపురం, రేబాల, చెల్లాయపాలెం, రామచంద్రపురం గ్రామాలలో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించమన్నారు. నెలాఖరికల్ల పెండింగ్ పనులను పూర్తి చేసి వాటిని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్లు అన్నారు. అనంతరం షర్మిలా పై ఆయన ధ్వజమెత్తారు. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ నాయకుల కాళ్లు ముందు పెట్టిందని మండిపడ్డారు.

కుటుంబ సమస్యలు రాజకీయాలలోకి లాగడం సరైన పద్ధతి కాదన్నారు. అన్న పదవి ఇవ్వలేదని పదవి వ్యామోహంతోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ఎఫ్ఐఆర్ చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర 100 నుండి 200 కోట్ల రూపాయలు ప్యాకేజీ తీసుకొని షర్మిల తమ నాయకుడి పై విమర్శలు చేస్తుందని అన్నారు. ఇకనైనా షర్మిల నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి,నగర పంచాయతీ చైర్ పర్సన్ మోర్ల సుప్రజామురళి, వైసిపి టౌన్ ప్రెసిడెంట్  టంగుటూరి మల్లారెడ్డి, మండల వైసిపి అధ్యక్షులు చెర్లో  సతీష్ రెడ్డి, ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్ షకీలా, రాఘవ, శీను, శివ కుమార్ రెడ్డ,  ప్రసాద్ యాదవ్, ప్రమీలమ్మ, వైసిపి నాయకులు మోర్ల మురళి, పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, డాక్టర్,తదితరులు పాల్గొన్నారు.