vijay sai reddy
తెలంగాణ రాజకీయం

విజయ సాయి రెడ్డిపై పిర్యాదు

తెలంగాణ ప్రభుత్వం పై రాజ్యసభ లో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు పిర్యాదు చేసారు. కాంగ్రెస్ నేతలు కాల్వ సుజాత, పి విజయారెడ్డి బంజారాహిల్స్ పిఎస్ లో పిర్యాదు చేసారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెల్లలో కూలిపోతుందంటూ వాఖ్యలపై మండిపడ్డారు. రాజ్యసభ లో ఆన్ రికార్డ్ లో విజయ్ సాయి రెడ్డి మాట్లాడిన విషయాల పై కంప్లైంట్  ఇచ్చారు. బిఅర్ఎస్ , వైసీపీ కలిసి తెలంగాణ లో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయి. ఏపీ లో జరిగే  ఎన్నికలకు బిఅర్ఎస్ ఫండింగ్ ఇస్తుంది. ఇద్దరు మధ్య ఉన్న లోపాయకారి ఒప్పందం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర  తెలంగాణ లో సుస్థిర పాలన ఉంది .. ప్రభుత్వాన్ని ఎవరు కూల్చలేరు.

కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో విజయ్ సాయి రెడ్డి లాంటి నాయకుల వాఖ్యలు చెల్లుబాటు కావు. విజయ్ సాయి రెడ్డి వాఖ్యల పై సీబీఐ తో విచారణ చేయాలి. రాజ్యసభ చైర్మన్ విజయ్ సాయి రెడ్డి వాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.