dammaiguda (1)
తెలంగాణ రాజకీయం

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

దమ్మైగూడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించి తలపెట్టిన సిసి రోడ్డు పనులకు బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్, స్థానిక వార్డు కౌన్సిలర్ పశుపతి రమేష్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రణీత శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ దశలవారీగా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. వార్డు కౌన్సిలర్ వసుపతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని వార్డులలో మౌలిక వసతుల కల్పనకు చైర్పర్సన్ ఆయా సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. మున్సిపల్ నిధులు మంజూరు చేయిస్తూ మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, స్థానిక నాలుగో వార్డ్ కౌన్సిలర్ మంగళ పూరి వెంకటేష్, విఎంఎస్ హోమ్స్, అంజనాద్రి నగర్, ఎల్ఎస్ఆర్ కాలనీ అధ్యక్షుడు, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు