bandi-padayatra
తెలంగాణ రాజకీయం

బండి సంజయ్ పాదయాత్రను విజయవంతం చేయాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ప్రజా ఆశీర్వాదం కోసం ఈ రోజు నుండి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేస్తున్న బస్సు యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని జిల్లా బిజెపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ,  కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకున్న అనంతరం వేములవాడ నియోజకవర్గం లోని మేడిపల్లి నుండి ప్రారంభమవుతుందని, ఈ యాత్రలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పార్టీని బలోపేతం చేయడానికి వస్తున్నట్లు, అలాగే నరేంద్ర మోడీ విజయాలను ప్రస్తావించనున్నట్లు చెప్పారు. గత సంగ్రామ యాత్రతో బిఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలాయని, ఈసారి కాంగ్రెస్ పార్టీ భవితవ్యం తెలుతుందన్నారు. వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే ఈ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు.