jagan-survey
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

వైసీపీ నేతలకు రీ-సర్వే  టెన్షన్

ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు రీ-సర్వే  టెన్షన్ పట్టుకుందా ? అభ్యర్థిత్వం ఖరారైన నేతలు…ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం షురూ చేశారు. భారీగా ఖర్చు చేస్తున్న నేతలకు…వైసీపీ షాకిచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో మళ్లీ రీ సర్వే చేయిస్తున్నట్లు బాంబు పేల్చింది.  విశాఖ జిల్లాలోని నేతల పరిస్థితి కక్కలేక… మింగలేక అన్నట్లు తయారైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్  అభ్యర్థుల ఎంపిక చేస్తున్నారు. స్థానిక సమీకరణాలు, కుల సమీకరణాలు ఆధారంగా విస్తృతమైన వడపోత పోసింది. ఆ తర్వాత సమన్వయకర్తలు మార్పులు చేసింది. విశాఖ జిల్లాలో అనూహ్యమైన నిర్ణయాలను అమలు చేసింది. సర్వేలు ఆధారంగా కొత్త నాయకత్వం ఎంపిక చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పుంజు  కోలేదనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో రీ సర్వేలు జరుగుతుండటంతో చివర వరకు రేసులో మిగిలేది ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబును ఓడించాలన్న లక్ష్యంతో ఉంది.

2019లో యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయ నిర్మలను బరిలోకి దించింది. జనసేన ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలిపోవడంతో వెలగపూడి 25వేల ఓట్లతో గెలుపొందారు. వైసీపీ, జనసేన అభ్యర్థులు యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో విజయ నిర్మల ఓటమి పాలయిందని వైసీపీ లెక్కలు వేసుకుంది. ఆమెకు సీటు గ్యారెంటీ అన్న సమయంలో సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఎంట్రీ ఇచ్చారు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన వెలగపూడిని ఎదుర్కోవాలంటే… అదే కులం అభ్యర్థి అయితే కరెక్ట్ అనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఎంవీవీ సత్యనారాయణను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైసీపీ అదేశించింది. గెలిచి తీరాలనే లక్ష్యంతో…పండుగలు, వేడుకల్లో కులాలు, మతాల వారీగా ప్రజలు, కేడర్ అవసరాలకు భారీగా డబ్బు కుమ్మరిస్తున్నారు. ఇంత చేసినా తూర్పులో ఎంవీవీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రావడం లేదనే చర్చ జరుగుతోంది. అరకులోయలో ఎంపీ మాధవి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది వైసీపీ అధిష్ఠానం. స్థానిక వ్యతిరేకత కారణంగా పునరాలోచనలో పడింది.

ఎంపీ మాధవి స్థానంలో నూతన సమన్వయకర్తగా రేగం మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పులు తర్వాత మరికొన్ని నియోజకవర్గాలలో రీ సర్వే చేయిస్తోంది. కేప్రజాదరణతో పాటు నాయకత్వం అంగ, అర్ధబలం  ఆధారంగా మరోసారి మార్పులు సాధ్యం అనే దిశగా చర్చ జరుగుతోంది. అటు భీమిలిలో విజయ నిర్మల కుటుంబంపై అధినాయకత్వానికి పాజిటివిటీ ఉండటంతో….యాదవులకు అవకాశం ఇవ్వాలనే పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఈక్వేషన్ ను అధిష్ఠానం వర్కవుట్ చేస్తే ఎంటన్న చర్చ జోరుగా జరుగుతోంది.మేయర్ గొలగాని హరి వెంకట కుమారి… అసెంబ్లీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రీ-సర్వే ప్రభావం ఇక్కడ మార్పులను ప్రభావితం చేస్తుందా…? లేక ఎంవీవీ సత్యనారాయణ సమర్థత వైపే మొగ్గు చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

గాజువాక లో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని ఫస్ట్ లిస్టులోనే వైసీపీ మార్చేసింది. కార్పొరేటర్ ఉరుకూటి చందును నియమించి షాక్ ఇచ్చింది. ఈ మార్పులు ముందుగా ఎమ్మెల్యేకు చెప్పే చేశామని పార్టీ పెద్దలు చెప్పినప్పటికీ కేడర్ అంగీకరించడం లేదు. గాజువాక,తూర్పు సీట్లలో రీ సర్వేలు ఎవరిని ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.