harish rao
తెలంగాణ రాజకీయం

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూరం

అసెంబ్లీలో ఇరిగేషన్‌ మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. ఈ చర్చలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేత పత్రం సత్యదూరంగా ఉందని విమర్శించారు. సభలో ఇచ్చిన పుస్తకం తప్పుల తడకగా ఉందని ఆరోపించారు. ఆ మేరకు ఆయన ఒక్కో అబద్ధాన్ని విడమర్చి చెప్పారు.మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి అయ్యింది అన్నారు. కాలేదు. అప్పుడు రూ. 106 కోట్లు ఖర్చు చేస్తే, మేము వచ్చాక రూ.775 కోట్లతో చేసి నీళ్ళు ఇచ్చాం.ఖర్చు, ఆయకట్టు విషయంలో తప్పుగా చెప్పారు. ఒక్కో పేజీలో ఒక్కో విధంగా చెప్పారు.రాయలసీమ లిఫ్ట్ విషయంలో మేం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు అన్నారు. అది తప్పు. 2020 మే 5న జీఓ వచ్చింది. అయితే జనవరి లోనే మేం కేంద్రానికి ఫిర్యాదు చేశాం.కేఆర్ఎంబీకి అప్పగించాలని గెజిట్ ఇస్తే మేం సవాల్ చేయలేదు అని పేజీ 14 లో చెప్పారు. అది తప్పు. మేం వ్యతిరేకిస్తూ రిఫర్ చేయాలని చెప్పాం.కేఅర్ఎంబీకి అప్పగించింది మేం అన్నారు. అవాస్తవం.

మీరు అధికారంలోకి వచ్చాక బోర్డుకు అప్పగించినట్లు చెప్పే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు పెట్టాం. ఇదే విషయం అన్ని పత్రికల్లో వచ్చింది.50:50 రేషియో కోసం మేం కొట్లాడలేదు అన్నారు. రాష్ట్ర విభజన నుంచి ఎన్నోసార్లు కొరాం. ఫిర్యాదులు చేశాం. న్యాయమైన వాటా కోసం ట్రిబ్యునల్ వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాం. అంటూ హరీష్ రావు ఒక్కో అబద్ధా్న్ని ఎత్తిచూపారు.