modi
జాతీయం రాజకీయం

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మోడీ

మూడోసారి మోడీని ప్రధాని చేసేందుకు సంకల్పించిన యాత్రే విజయ సంకల్ప యాత్ర అని రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు. అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేసిన వ్యక్తి మోడీ అని పేర్కొన్నారు. కారణ జన్ముడు మోడీ అని కొనియాడారు. రాముడు లేడు, రామసేతువు మీదా అంటూ కాంగ్రెస్ నిసిగ్గూగా మాట్లాడుతోందని ఆరోపించారు. నిలువ నీడ లేని వారికి 4 కోట్ల ఇళ్లు కట్టించిన వ్యక్తి మహానుభావుడు మోడీ అని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని దుయ్యబట్టారు. సినిమాలో చూపించినట్లు కోడిని దూలానికి వేలాడదీసి భోజనం పెట్టించినట్లు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ వ్యవహారం ఉందని విమర్శించారుపేదరికం, పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి మోడీ.. మహిళల కష్టాలు మోడీకి తెలుసని లక్ష్మణ్ తెలిపారు. మోడీ అవినీతి ఆరోపణలు లేకుండా పరిపాలన చేస్తున్నారని.. పేదవాడు దేశ ప్రధాని అయ్యిండు.. దేశం కోసం పని చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్.. కల్వకుంట్ల కుటుంబం కోసం, గాంధీల కుటుంబం కోసం కాంగ్రెస్ పని చేస్తోందని విమర్శించారు. మరోవైపు.. తెలంగాణ రైల్వే కోసం మోడీ రూ. 4500 కోట్లు కేటాయించారని అన్నారు.

రాహుల్ గాంధీకి పేదల బ్రతుకుల గురించి తెలియదని లక్ష్మణ్ అన్నారు. జోడోయాత్ర పేరుతో రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడని.. రాహుల్ యాత్ర వల్ల ఉపయోగం లేదని విమర్శించారు. 370 ఆర్టికల్ రద్దు వల్లే అందరూ ధైర్యంగా ఉన్నారన్నారు. అవినీతి, కుటుంబ పాలన బీఆర్ఎస్ ది.. దాన్ని నమ్మి ప్రజలు మళ్ళీ మోసపోవద్దని సూచించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము.. దాన్ని మెడలో వేసుకునే ఉద్దేశ్యం బీజేపీకి లేదని తెలిపారు. కాంగ్రెస్ గ్యారెంటీలు చెల్లవని… దేశంలో చెల్లెవి మోడీ గ్యారెంటీలేనని పేర్కొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి.. అతన్ని లోక్ సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.