అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న బీఆర్ఎస్లోక్ సభ ఎన్నికల్లో అయినా పట్టునిలుపుకుని సత్తా చాటేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి వెంటనే తేరుకున్న పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒకసారి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షించింది. కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు పాల్గొని శ్రేణుల్లో ధైర్యం నింపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత విరామం అనంతరం మళ్లీ లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు తిరిగి ప్రారంభించనున్నారు.అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడిన బీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమీక్ష, లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు తిరిగి ప్రారంభించారు.లోక్ సభ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా గత నెల 27 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ఫిబ్రవరి 10 నాటికి సమావేశాలు ముగించేలా ప్లాన్ చేసుకుంది. అయితే అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇప్పుటికే సుమారు 40 నియోజకవర్గాలు పూర్తికాగా….మిగిలిన చోట్ల నిర్వహించేందుకు పునః ప్రారంభించారు.
మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉండటంతో….ఈనెలాఖరు లోగా సమీక్షలు పూర్తి చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. దీనిపై సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. మాజీ మంత్రి హరీశ్‌రావు షాద్‌నగర్ లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. విదేశ పర్యటనలో ఉన్న కేటీఆర్ తిరిగొచ్చాక ఈ భేటీల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు ముగిశాక.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ బలంగా ఉండి,తప్పకుండా గెలుస్తామనుకున్న చోటా ఓటమి పాలవ్వడంపై బీఆర్ఎస్అధినాయకత్వం సమీక్షిస్తుంది. ఓటమికి కారణాలను అన్వేషిస్తోంది.
లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ ఇది పునరావకృతం కాకుండా జాగ్రత్త వహిస్తోంది. జనవరి 3 నుంచి 22వ తేదీ వరకు మూడు విడతల్లో 17 లోక్‌సభ సెగ్మెంట్లపై సుదీర్ఘంగా సమీక్షించిన పార్టీ ముఖ్యు లు.. నేతలు, కార్యకర్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ను నివేదికల రూపంలో కేసీఆర్‌కు అందజేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. అసెంబ్లీ సమీక్ష సమావేశాల్లో అందరి అభిప్రాయాలను క్రోడీకరించి లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. నియోజవర్గస్థాయి సమావేశాలకు పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, నిరంజన్ రెడ్డి, పోచారం, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ కు పెద్దఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఉన్నా క్షేత్రస్థాయిలో వారిని సమన్వయం చేసే గ్రామ కమిటీలు లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నట్లు పార్టీ గుర్తించింది.అందుకే లోక్ సభ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్టీని అన్నిస్థాయిల్లో బలోపేతం చేసేందుకు సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలసింది