tdp-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఏపీలో కండోమ్ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు  సమీపిస్తున్న కొద్ది…పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు, నేతలు క్యాంపెయిన్ చేస్తున్నారు. పోటాపోటీ సభలు, ర్యాలీలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు, విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి దాకా బూతు పురాణం రెచ్చిపోయారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కుటుంబసభ్యులపై అసభ్యంగా మాట్లాడుతూ…రాజకీయాలను దిగజార్చుతున్నారు. తమ ప్రత్యర్థుల పెళ్లిళ్లు, ఎఫైర్లు అంటూ వ్యక్తిగత దూషణలు చేస్తూ… తమ పార్టీ హైకమాండ్ ను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు పెళ్లాలు, ఎఫైర్లు, అంబోతులు, కుక్కలు అంటూ మాట్లాడుకున్న పార్టీలు…మరింతగా రెచ్చిపోతున్నాయి. ప్రత్యర్థులను ఎలాగైనా డ్యామేజ్ చేయాలన్న కసితో అనేక రకాల కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో కండోమ్‌ లకు ప్రాధాన్యత పెరిగింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కండోమ్‌లు ఎన్నికల ప్రచార సాధనంగా మారాయి.

నిరోధ్ గురించి మాట్లాడుకోవడమే తప్పుకునే స్టేజ్ నుంచి నిరోధ్ లోనే ప్రచారం షురూ చేశాయి. నీచాతినీచ కామెంట్లపై పరిమితమైన పార్టీలు… ప్రత్యర్థులపై ఏకంగా కండోమ్ ప్యాకెట్లతో టార్గెట్ చేస్తున్నాయి. అగ్గి పుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ల కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు…ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. ఏపీలో రాజకీయ పార్టీలు మరో అడుగు ముందుకేసి కండోమ్‌లు…రాజకీయ ప్రచారానికి అనర్హం కాదన్నట్లు నిరూపిస్తున్నాయ్, అధికార వైసీపీ, టీడీపీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి కండోమ్‌ ప్యాకెట్లను ప్రచారానికి వాడుకుంటున్నాయి. వాడు, వాడు బాబు, వాడమ్మ మొగుళ్ల కామెంట్లను మించేలా కండోమ్ లతో ప్రత్యర్థులపై దుర్మార్గమైన విషప్రచారం చేస్తున్నాయి. అమ్మఒడి పథకానికి పిల్లల్ని తగ్గించడానికి టీడీపీ వాళ్లు టీడీపీ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో…ఇంటింటికీ కండోమ్స్ పంచుతున్నారంటూ వైసీపీ ప్రచారం చేసింది. కండోమ్ ప్యాకెట్లపై తెలుగుదేశంపార్టీ సింబల్, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ స్లోగన్ ను ముద్రించారు. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వీడియో కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.వైసీపీ కండోమ్ ప్యాకెట్ల ప్రచారంతో తెలుగుదేశం పార్టీ శ్రేణలు అప్రమత్తమయ్యాయి.

వైసీపీకి కౌంటర్ గా టీడీపీ శ్రేణులు… వైసీపీ సిద్ధం పేరుతో కండోమ్  ప్యాకెట్లు పంచుతోందంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. వైఎస్ఆర్సీపీ సిద్ధం.. సిద్ధం అని కేకలు పెట్టేది ఇందుకా ? ఇలాంటి నీచపు ప్రచారాలు చేసే బదులు శవాల మీద చిల్లర ఏరుకోవచ్చు కదా అంటూ టీడీపీ శ్రేణులు కొటేషన్లు పెడుతున్నాయి. ఇలా ప్రధాన పార్టీలు సోషల్ మీడియా వేదికగా….ఒకరిపై మరొకరు దిగజారి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇది కండోమ్‌లతో ఆగిపోతుందా లేదా ప్రజలకు వయాగ్రా పంపిణీ చేయడం ప్రారంభిస్తారా ? అన్న చర్చ జరుగుతోంది. ఛీ…ఛీ.. ఏపీ రాజకీయ పార్టీలు ఇంత దిగజారిపోయారా ? మున్ముందు ఇంకెంత దిగజారుతారో అన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది.ఇలాంటి ప్రచారం ఏదో అనామక అకౌంట్ల నుంచి వేస్తే చిల్లర బ్యాచ్ ప్రచారం అనుకోవచ్చు కానీ…. ఏకంగా పార్టీ హ్యాండిల్ చేసే మెయిన్ అకౌంట్ల నుంచే ఇది జరగడంతో ఇరు పార్టీలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దిగజారుడుతనం ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో అన్న చర్చ కూడా నడుస్తోంది.