టీడీపీ జాబితాను వెలువరించిన అనంతరం ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.తానెప్పుడూ ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని పేర్కొన్నారు. 1 కోటి 10 లక్షల మంది నుంచి అభిప్రాయ సేకరణ జరిపానన్నారు. టీడీపీ లో ఇంత పెద్ద లిస్ట్ ఇవ్వడం ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు. విన్నింగ్ హార్స్‌లను , పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్న వాళ్లకు కొంతమందికి ఇవ్వలేకపోయారన్నారు. వారందరినీ పిలిపించి మాట్లాడుతానన్నారు. వారందరికీ పార్టీ బాధ్యతలు ప్రస్తుతం అప్పగిస్తానని చంద్రబాబు వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే టికెట్ కేటాయించని అభ్యర్థులందరికీ పదవులు కూడా ఇస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేశానన్నారు. కొత్త వారికి 23 మందిని అభ్యర్థులుగా ఎంపిక చేశామన్నారు. బీజేపీతో పొత్తు విషయం చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. మిగతా జాబితా కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. వైసీపీ ఇన్‌చార్జిలు, సమన్వయకర్తలను ప్రకటించిందన్నారు. టీడీపీ నేరుగా అభ్యర్థులను ప్రకటించిందని చంద్రబాబు అన్నారు.