ramana deekshitulu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

నేను అలా మాట్లాడలేదు

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యవహారం ఏపీలో దుమారం రేపుతోంది. తిరుమల ఆలయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పినట్లుగా ఓ వీడియో వైరల్ కావడంతో.. దానిపై తిరుమల అర్చకులు మండిపడ్డారు. అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని రమణదీక్షితులపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై రమణ దీక్షితులు స్పందించారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను అలా మాట్లాడే వాడిని కాదని… అది తన స్వభావం అది కాదని స్పష్టం చేశారు. తాను చేయని దానికి తనను బలిదానం చేస్తే ఏమీ చేయలేనన్నారు. తరతరాలుగా స్వామి వారి కైంకర్యాలు చేస్తున్నట్లుగానే ఇప్పుడు చేస్తూ వస్తున్నామన్నారు రమణ దీక్షితులు. ఇందులో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు రమణదీక్షితులు.