సీబీఐ కోర్టులో నేడు విచారణ
సీబీఐ కోర్టులో నేడు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసులో సీఎం జగన్, తదితరులు డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అటు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా చార్జిషీటు నుంచి తనను తొలగించాలని ఆమె కోరారు. సబిత డిశ్చార్జి పిటిషన్ పై కౌంటరుకు సీబీఐ అధికారులు గడువు కోరారు. సబిత డిశ్చార్జి పిటిషన్ పై తదుపరి విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 22కి వాయిదా వేసింది.
ఇక, ఇతర నిందితులు రాజగోపాల్, శామ్యూల్ కూడా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది.