pawan-ycp
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పావలా…పవన్… వైసీపీ బాధేంటీ…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. బీజేపీ పొత్తులోకి వస్తే ఏ సీట్లు కేటాయించాలన్న దానిపైనా ఓ నిర్ణయానికి వచ్చారు జనసేన పార్టీకి 24 అసెంబ్లీ , మూడు పార్లమెంట్ సీట్లను కేటాయించారు. పట్టుదలకు పోయి ఎక్కువ సీట్లలో పోటీ  చేయడం కన్నా… ఖచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.. వైసీపీ వైపు నుంచి విమర్శలు ప్రారంభమయ్యాయి. టీడీపీకి పార్టీని అమ్మేశారని ఒకరు.. విలీనం చేసి ఉపాధ్యక్ష పదవి తీసుకోవచ్చు కదా అని ఇంకొకరు విమర్శించడం ప్రారంభించారు. అయితే జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తే వైసీపీకి ఎందుకనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది.  అంతగా  బాధపడాలనుకుంటే.. జనసేన నేతలు బాధపడతారు. జనసేన గత ఎన్నికల్లో ఆరు శాతం లోపు సీట్లు తెచ్చుకుంది. ఒక్క ఎమ్మెల్యే సీటును అతి తక్కువ మెజార్టీతో గెలుచుకున్నారు. స్వయంగా పవన్  కల్యాణ్‌  రెండు చోట్ల ఓడిపోయారు. అదే సమయంలో పదేళ్లు అయినా పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు.

ఎలక్షనీరింగ్ చేయగల వ్యవస్థలు ఏర్పాటు కాలేదు. ఇలా అన్నీ ఆలోచించుకుని పవన్ కల్యాణ్ ఓట్లు చీలకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం మొదటి నుంచి పవన్ ఏవో కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తారని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఆయనకు అరవై సీట్లు ఇస్తారని..డెభ్బై సీట్లు ఇస్తారని కూడా ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. జనసేన పార్టీకి అంత హైప్ ఎందుకు ఇస్తున్నారో  రాజకీయాను కాస్త లోతుగా ఆలోచించే వారికే అర్థమవుతుంది.    పవన్ కల్యాణ్‌కు తక్కువ సీట్లు ఇచ్చారని.. వైసీపీ నేతలు ఆరోపణలు చేయడం ..పవన్ పై విమర్శలు చేయడం వెనుక ఉన్న కీలక అంశం.. పవన్ కల్యాణ్ ను అభిమానించే వారి ఓట్లను.. టీడీపీకి పడకుండా చేయడం. పొత్తుల్లో ఎవరికైనా ఓట్ల బదలాయింపు కీలకం.  రెండు పార్టీల్లో ఒకరిపై ఒకరికి వ్యతిరేక త పెంచడం ద్వారా.. ఓట్లు బదిలీ జరగకుండా చూస్తే అది తమకే ప్లస్ అవుతుందని వైసీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అందుకే జనసేన ఫ్యాన్స్ ను.. టీడీపీపై రెచ్చగొట్టేందుకే ఈ తరహా విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే .. పవన్ కల్యాణ్ ను .. వైసీపీ నేతలు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల.. పొత్తులపై జనసైనికులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వైసీపీ సర్కార్ ను..  పవన్ ను దూషించిన వారిని ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో జనసైనికులు ఉన్నారని.. అంటున్నారు. క్షేత్ర స్థాయిలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసైనికులు .. పవన్ కల్యాణ్ నేరుగా మద్దతు ప్రకటించకపోయినప్పటికీ టీడీపీకే మద్దతు తెలిపారని అంటున్నారు. ఈ పరిణామంతో వైసీపీ ప్రయత్నాలు సక్సెస్ కావని అంటున్నారు. జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే.. ముందగా వైసీపీకే ఎక్కువ లాభమన్న అంచనాలు ఉన్నాయి. పెద్దగా బలం లేని చోట కూడా పోటీపడి సీటును తీసుకోవడం వల్ల ఆ అభ్యర్థిని సునాయసంగా ఓడించవచ్చని వైసీపీ ప్లాన్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. పొత్తుల రాజకీయాల్లో ప్రత్యర్థికి ఉండే వెసులుబాటు ఇదే. పొత్తుల్లో ఉన్న పార్టీలు.. వాటికి సంబంధించిన ఓటు బ్యాంకుల మధ్య సానుకూలత ఉంటే.. ఏమీ చేయలేరు.

కానీ.. అలాంటి పరిస్థితి లేకపోతే.. బలహీనం ఉన్న పార్టీ పోటీ చేస్తే.. సలువుగా గెలుచుకోలగరు. జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని వైసీపీ ఈ కారణంగానే కోరుకుందన్న వాదన కూడా వినిపిస్తోంది.    జనసేన విషయంలో పవన్ పై వైసీపీ నేతలు , మంత్రులు చేస్తున్న విమర్శలు ఆ పార్టీకి మిస్ ఫైర్ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో పెద్దగా జనసేనతో సంబంధం లేని వారు.. తాము జనసేనకు ఓటు వేస్తామని.. టీడీపీకి వేయమని ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇదంతా.. ఎన్నికల స్ట్రాటజీ .  నిజమైన జనసేన ఓటర్లు మాత్రం.. ఈ సారి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ బలమైన పాత్ర పోషిస్తారన్న నమ్మకంతో ఉన్నారు.  అందుకే..  జనసేన కు అండగా ఉండే వర్గాలన్నీ.. ఈ సారి కూటమిని దాటి పోవని అంచనా వేస్తున్నారు.