జాతీయం ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌లో చేర‌నున్న ప్ర‌శాంత్ కిశోర్‌!

ఎన్నిక‌ల వ్యూహ‌కర్త‌గా పేరుగాంచిన ప్ర‌శాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్న‌ట్లు ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మంగ‌ళ‌వారం ఆయ‌న పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌హా రాహుల్‌, ప్రియాంకా గాంధీల‌ను కూడా క‌లిసిన విష‌యం తెలిసిందే. రానున్న రాష్ట్రాల ఎన్నిక‌లు, 2024 సాధార‌ణ ఎన్నిక‌ల గురించి ప్ర‌శాంత్ కిశోర్‌.. గాంధీల‌తో చ‌ర్చించిన‌ట్లు భావించినా.. అంత‌కంటే పెద్ద‌దే ఏదో జ‌ర‌గ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

2024 ఎన్నిక‌ల కోసం కాంగ్రెస్ పార్టీలో పీకే కీల‌క పాత్ర ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం. ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌కు వ్యూహ‌క‌ర్త‌గా పనిచేసిన పీకే.. ఆ పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన త‌ర్వాత తాను ఇక వ్యూహ‌క‌ర్త ప‌ద‌వి నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. రాజ‌కీయాల్లో వ‌స్తారా అని ప్ర‌శ్నించ‌గా.. తానో విఫ‌ల నేత‌న‌ని చెప్పారు. గతంలో పీకే.. నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూలో చేరిన విష‌యం తెలిసిందే.