పాత బస్తి నుంచి యాఖత్త్ పురా అసెంబ్లీ ఐ ఎస్ సదన్ చౌరస్తా కు చేరుకున్న విజయ సంకల్ప యాత్ర కు ప్రజలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ డా లక్ష్మణ్ మాట్లాడారు.మోది ని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించామని తెలిపారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోది యని కొనియాడారు. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోది అన్నారు. రాముడే లేదు..రామునికి గుడి ఎందుకు ఆన్న కాంగ్రెస్ పార్టీ. ఇపుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారని విమర్శించారురాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో.. రామునికి గుడి కట్టిన మోది కావాలో ప్రజలు ఆలోచించాలని ప్రశ్నించారుకర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన ల్సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారని గుర్తు చెసారుమన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటని అన్నారు.
వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారుదేశం సస్యసామలంగా ఉండాలంటే మోది ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీ లు ఓవైసీ తొత్తులుగా మారి పాత బస్తి నీ డెవలప్ జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. బి అర్ ఎస్ కెసిఆర్ కుటుంబం కోసం పని చేస్తుందని.కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుందని.కానీ బిజెపి పార్టీ మోది సర్కార్ మాత్రం ప్రజల కోసం దేశం కోసం పని చేస్తుందని చెప్పారు. పాత బస్తీ బాగుపడాలంటే బిజెపి నీ గెలిపించాల్సిందనని.ఎక్కడ చూసినా ఫిర్ ఏక్ బార్ మోది సర్కార్ అనే నినాదం వినిపిస్తుందని తెలిపారూ.ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలోజిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి. కార్పొరేటర్లు జంగం శ్వేతా మధుకర్ రెడ్డి.కొత్త కాపు అరుణ.భాగ్య లక్ష్మీ. మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ. జిల్లా ఉపాధ్యక్షుడు మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు