వైఎస్ వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి అరోపణలపై దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి స్పందించారు. నేను కడప సెంట్రల్ జైలుకు మెడికల్ క్యాంపు కోసం వెళ్లాను. జైలులో ఉండే వారి అరోగ్య పరీక్షల నిమిత్తమే జైలుకు వెళ్లాను. జైలులో నేను నిజంగా దస్తగిరిని బెదిరించి ఉంటే అప్పుడే ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదని ప్రశ్నించారు.
మెడికల్ క్యాంపుకు వెళ్లినప్పుడు నాతో పాటు జైలు అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. జైలులో ప్రతి చోట సిసి కెమెరాలు ఉంటాయి . అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండే వాడిని అన్నారు.
మూడు నెలల అనంతరం ఫిర్యాదు చెయ్యడంలో అంతర్యమేమీటీ . దస్తగిరి ఎవరి డైరెక్షన్ లో మాట్లాడుతున్నాడో అందరికి అర్ధమవుతొంది. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికి లేదు. ఇప్పుడు మా నాన్న శంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తొంది. ఇదంతా కేవలం బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఈ కథలన్ని అల్లుతున్నారు. బెయిల్ తిరష్కరణకు గురైన తరువాత మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివి ఎమీ ఉండవు. దస్తగిరి అప్రేవర్ గా మారడంలోను కుట్ర దాగుంది.
కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఎందుకు వివేకా కుమార్తె సునీత ప్రశ్నిచడం లేదని ప్రశ్నించారు. హత్య జరిగిన తరువాత డాక్యూమెంట్స్ కోసం వెతికామని దస్తగిరి చెప్పాడు. హత్య జరిగిన తరువాత పారిపోతారు గానీ… డాక్యూమెంట్స్ కోసం వెతుకుతారా. పిఎ క్రిష్ణారెడ్డి కూడా వివేకానందరెడ్డి కింద పడి… రక్తపు వాంతులతో చనిపోయాడని చెప్పాడు. హత్య తరువాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. సునీతకు ఎందుకు వీటిపై ప్రశ్నించడం లేదు ? ఎంపి అవినాష్ రెడ్డి రాత్రంతా వాట్సప్ లో యాక్టీవ్ గా ఉన్నారని అరోపించారు . ఎన్నికల సమయంలో ఎంపిగా అయనకు సవాలక్షా మెసెజ్ లు వచ్చి ఉంటాయి. అంతకు ముందెప్పుడు అయన వాట్సప్ లో యాక్టీవ్ గా ఉన్నారో లేదో చూడండి. మా తండ్రి శంకర్ రెడ్డిని రెండున్నరేళ్లుగా చెయ్యని తప్పకు జైల్లో ఉంచారు. చంద్రబాబు చెప్పడం … సునీత చెప్పడం …దస్తగిరి అరోపణలు చెయ్యడం . ఇప్పుడు కూడా బయటకు రాకుండా బెయిల్ అడ్డుకోవడానికే ఈ అరోపణలని ఆరోపించారు. ఈ డ్రామాలు, కథలు అన్ని ఇప్పటివి కావు. కేసు మొదటి నుంచి అపద్దాలే చెబుతున్నారని అన్నారు.