మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ప్రతి వార్డుకు రూ.30 లక్షలు చొప్పున 2024-25 బడ్జెట్ మున్సిపల్ సాధారణ నిధుల నుంచి రూ.5.40 కోట్లు కేటాయించినట్లు ఆమె చెప్పారు. స్టేషనరీ బుక్స్ కొనుగోలు చేయడానికి రూ. 5 లక్షలు, బ్లూ క్రాస్ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ వారి ద్వారా మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టించి ఏబీసీ సెంటర్లో అడ్మిషన్ చేయడానికి రూ. 25 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. అనంతరం వివిధ అవసరాల నిమిత్తం సాధారణ నిధులను వినియోగించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, డిఈఈ చిరంజీవిలు, టిపిఓ శ్రీధర్ ప్రసాద్, మేనేజర్ వెంకటేశం, కౌన్సిలర్ రామారాం శ్రీహరి గౌడ్, నాను నాయక్, సంపన్న బోల్ స్వప్న హరి గౌడ్, పాండాల అనురాధ, గోగుల సరిత, ముప్పా శ్రీలత, నాగయ్య పల్లి సుజాత, మంగళపురి వెంకటేష్, కొత్త సురేఖ, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రభు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
Related Articles
టీడీపీలో చేరికలు
విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా రా…
అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.29 పూజా కార్యక్రమాలతో ప్రారంభం
హాస్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్…
కమలం ట్రాప్ లో గులాబీ
బీజేపీ ట్రాప్లో కేటీఆర్ పడ్డారా? అమృత్ టెండర్ల వ్యవహారంలో అ…