ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

పదునైన ఆయుధాలపై నిషేధం పొడిగింపు

హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలు

రాయలసీమ సహా కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదును కలిగిన ఆయుధాలపై నిషేధాన్ని పొడిగిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్-4 ప్రకారం రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు సహా ఆంధ్రప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదునైన ఆయుధాలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ వెలువడింది. ఈమేరకు ఈనెల 15వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.