జాతీయం ముఖ్యాంశాలు

భర్తను హింసించే భార్యపై గృహ హింస కేసు పెట్టొచ్చు

ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

తాజాగా ఢిల్లీ హైకోర్టు ముందుకు ఓ పిటిషన్ వచ్చింది. దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గృహహింస చట్టంపై కోర్టు సంచలన ప్రకటన చేసింది. ఇకనుంచి మహిళలపై కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది. ‘భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు’ అనే పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకనుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. భర్తలు కూడా న్యాయం కోసం పోరాడవచ్చని తెలిపింది.
మహిళలపై రోజురోజుకూ జరుగుతున్న ఘోరాలను అరికట్టేందుకు 2006లో గృహ హింస నిరోధక చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. కొందరు మహిళలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని.. భార్యా బాధితులు అంటున్నారు. ఈ క్రమంలో వేసిన పిటిషన్ పై విచారించిన ఢిల్లీ హైకోర్టు.. భర్తను వేధించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని స్పష్టం చేసింది.