jagan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇక సాగవు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆటలు ఇక సాగవని బద్వేలు తెలుగుదేశం పార్టీ  సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ క్లాస్ వన్ కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి బద్వేలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళరెడ్డి అన్నారు ఈ మేరకు వారు సోమవారం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనను దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అన్ని వర్గాలను నాశనం చేసినట్లు ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని తెలిపారు తెలుగుదేశం జనసేన విజయాన్ని ఎవరు కూడా అడ్డుకో లేరని వారు పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా జాబ్ కేలండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు ఎన్నికలు దగ్గరికి రావడంతో దగా డీఎస్సీ ప్రకటించారని తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నుండి ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రకృతి వనరులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.

ఆదివారం సత్య సాయి జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు రాయలసీమ ప్రాంతం నుంచి వందలాది ఆర్టీసీ బస్సులు తరలించి జనం ఉసురు పోసుకున్నారని విమర్శించారు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని  కావానీ అన్నారు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఆ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కల్పించలేదని ఆరోపించారు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగంలో నిరుద్యోగులకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని ఈ విషయంలో మాట తప్పేది లేదన్నారు రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ఓటర్లు అంతా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఉమ్మడి కడప జిల్లాలో వైకాపా నాయకుల్లో ఒకరంటే ఒకరికి సరిపోవడం లేదన్నారు కడుపులో కత్తులు పెట్టుకొని నోసాటితో నవ్వుకుంటూ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తున్నారని సూర్యనారాయణ రెడ్డి వెంగళరెడ్డి విమర్శలు చేశారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి గుణపాఠం తప్పదన్నారు