జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో రాజద్రోహం చట్టానికి రోజులు దగ్గర పడ్డాయా?

సెక్షన్ 124-A (దేశద్రోహం నేరం కింద కేసు)పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్షన్ 124-Aను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌‌పై విచారణ నిర్వహించింది. సెక్షన్ 124-A చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ రిటైర్డ్ మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్ కేర్ పిటిషన్ దాఖలు చేశారు. రాజద్రోహం కింద కేసు నమోదు చేసి సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలు పడ్డ కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ‘‘దేశంలో రాజద్రోహం చట్టానికి రోజులు దగ్గర పడ్డాయా?.  పాలక వర్గాల పైశాచికత్వానికి న్యాయదేవత చెక్ పెట్టనుందా?. ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్న 124A శకం ముగియనుందా?. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం స్వయంపాలనలోనూ ఎందుకుంది?. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ కామెంట్స్ ఏం చెప్తున్నాయి?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు