revanth
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఆర్ధిక మూలాలు దెబ్బతీసేస్తున్నారా…

రేవంత్ రెడ్డి దూకుడు ఆగడం లేదు.. కెసిఆర్ మూలాలను, కెసిఆర్ ఆర్థిక స్తంభాలను సమూలంగా పెకిలించే పనిలోపడ్డాడు. ఇప్పటికే ప్రణీత్ రావును అరెస్టు చేసి ఎవరెవరి ఫోన్లు ట్యాంపరింగ్ చేశారు? దీని వెనుక ఉన్నది ఎవరు? ఎవరు చేయమంటే చేశారు? అనే కోణంలో తీగలాగుతున్నాడు. అక్రమంగా సంపాదించిన ఆస్తులను పడగొడుతున్నాడు.. ఇప్పుడు కెసిఆర్ ఆర్థిక స్తంభమైన మై హోమ్ మీద పడ్డాడు. ఈ సంస్థ భూదాన్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై శివకాశి నోటీసులు భూదాన్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై శివకాశి నోటీసులు జారీ భూదాన్ భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై రేవంత్ దృష్టి సారించాడు.హైదరాబాద్ నగర శివారులో భూదాన్ భూములను మై హోమ్ ఆక్రమించిందనేది ప్రభుత్వ వాదన. గత ప్రభుత్వం ఈ భూములను మై హోమ్ కంపెనీకి ధారా దత్తం చేసిందని రేవంత్ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని వినికిడి. అందులో భాగంగానే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ద్వారా మై హోం కంపెనీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

150 ఎకరాల భూదాన్ భూముల్లో జూపల్లి రామేశ్వరరావుకు చెందిన మై హోమ్ కంపెనీ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందని.. వాటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది. వాస్తవానికి రేవంత్ రెడ్డికి, మై హోమ్ జూపల్లి రామేశ్వరరావుకు ఎక్కడ చెడిందో గాని.. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉంది. అప్పట్లో రామేశ్వరరావు తో పడిన గొడవ వల్లే కెసిఆర్ రేవంత్ రెడ్డికి ఘర్షణ మొదలైందని రాజకీయ వర్గాలు అంటుంటాయి. ఆ ఘర్షణ కాస్త చినికి చినికి గాలి వాన లాగా మారి ఇక్కడ దాకా తీసు కొచ్చిందని చెబుతుంటాయి.సో, అందువల్లే రేవంత్ మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు వ్యాపారాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సానుకూలమైన స్పందన రాకుంటే ఆ భూదాన్ భూముల్లో నిర్మించిన భవనాలను ప్రభుత్వం పడగొట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై మై హోమ్ కోర్టుకు వెళ్లినప్పటికీ ఉపశమనం లభించదని, ఎందుకంటే ప్రభుత్వం వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ నిర్మాణాలను రేవంత్ పడగొట్టి, భూములను స్వాధీనం చేసుకుంటే మాత్రం ఒక చరిత్రే అవుతుంది. బిజెపి సెంట్రల్ నాయకులతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తున్న జూపల్లి రామేశ్వరరావు.. తన సమస్యను అక్కడిదాకా తీసుకు రాగలడా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న.