dammaiguda
తెలంగాణ రాజకీయం

దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి

దమ్మాయిగూడ మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చైర్ పర్సన్ వసుపతి ప్రనిత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని 7వ వార్డులో రూ. 39 లక్షల 70 వేల మున్సిపల్ సాధారణ నిధులతో భూగర్భ మురికి కాలువ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం పనులకు చైర్పర్సన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దశల వారీగా ఆయా కాలనీలలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ రాజ మల్లయ్య, స్థానిక వార్డు కౌన్సిలర్ మాదిరెడ్డి పావని రెడ్డి కాలనీ వాసులు పాల్గొన్నారు