cp radakrishnan
తెలంగాణ రాజకీయం

రాత్రి హైదరాబాద్ కు రానున్న గవర్నర్

తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో తెలంగాణకు కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం తెలిసిందే. కొత్త గా నియమితులైన గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ హైదరాబాద్ కు చేరుకున్నారు. రాంచీలోని రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 8.40కి స్థానిక బిర్సా ముండా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 9.10కి రాంచీ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో హైదరాబాద్ కు పయనం అవుతారు. రాత్రి 10.55 గంటలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి రాత్రి 11.35 గంటలకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు చేరుకోనున్నారు. బుధవారం (మార్చి 20న) ఉదయం 11:15 నిలకు  తెలంగాణ గవర్నర్‌గా సిపి రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముం ఆమోదించారు. అనంతరం తెలంగాణ కొత్త గవర్నర్‌గా ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్‌గా నియమించే వరకు తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ కొనసాగనున్నారు.