kcr-venu
తెలంగాణ రాజకీయం

కేసీఆర్ అరెస్ట్… తప్పదా

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సెలబ్రిటీ జ్యోతిష్యుడు అయ్యాడు. ఆయన చెప్పిన వాటిలో జరిగినవి వేళ్లమీద లెక్కి పెట్టేవే. గతంలో ఆయన కల్వకుంట్ల కవిత జాతకం గురించి చెప్పారు. ఆమె జాతకంలో కారాగార యోగం ఉందని చెప్పారు. ఆయన చెప్పినట్లే ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఆమె అరెస్ట్‌ అయ్యారు. కవితను ఈడీ విచారణ చేస్తోంది. ఈ క్రమంలోనే వేణుస్వామి మరో బాంబు పేల్చారు. కేసీఆర్‌ జాతకం చెప్పారు. ఆయన జాతకంలోను జైలు యోగం ఉందని వెల్లడించారు. వేణుస్వామి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. టీవీ ఛానెళ్లకన్నా యూట్యూబ్‌ ఛానెళ్లకు ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తారు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ అరెస్ట్‌ అవుతారని తెలిపారు. దీనికి యాంకర్‌ క్లీన్‌ పాలిటిక్స్‌ చేసిన ఆయన ఎలా అరెస్ట్‌ అవుతారని ప్రశ్నించారు. దానికి వేణుస్వామి సమాధానం చెబుతూ ఎలా జరుగుతుంది.. ఏం జరుగుతుంది అనేది తాను చెప్పలేనన్నారు. కేసీఆర్‌ మాత్రం తప్పకుండా జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు.

కాస్త ఆలస్యంగానైనా కేసీఆర్‌ జైలు జీవితం గడపక తప్పదన్నారు.ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ ప్రతిపక్ష నేత చంద్రశేఖర్‌రావుది ఒకే యోగమని తెలిపారు. గతంలో చంద్రబాబు అరెస్ట్‌ అవుతారని వేణుస్వామి చెప్పారు. ఆయన చెపిపనట్లే.. చంద్రబాబు అరెస్ట్‌ అయి రాజమండ్రి జైలులో ఉన్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్‌ వంతు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తోంది. దీని ప్రకారమే కేసీఆర్‌ జైలుకు వెళ్తారేమో అన్న చర్జ జరుగుతోంది.కవిత, చంద్రబాబునాయకుడు విషయంలో వేణుస్వామి చెప్పింది జరుగడంతో కేసీఆర్‌ విషయంలోనూ జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అయితే ఆయన ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగుమాత్రం పెట్టలేదు.