kejrival
జాతీయం రాజకీయం

ఏప్రిల్‌ ఒకటి వరకు కేజ్రీవాల్‌కస్టడీని పొడిగింపు

మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో ఆయనను ఈడీ కోర్టు ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా అరవింద్‌ కేజ్రీవాల్‌, ఈడీ వాదనలు వినిపించాయి. ఈడీ విజ్ఞప్తి మేరకు కోర్టు ఏప్రిల్‌ ఒకటి వరకు కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ వాంగ్మూలం ఇస్తూ.. సీబీఐ ఆగస్టు 17, 2022న కేసు నమోదు చేసిందని తెలిపింది.ఈడీ 2022 ఆగస్టు 22న ఈసీఐఆర్‌ దాఖలు చేసిందని తెలిపారు. నన్ను అరెస్టు చేసినా.. ఇప్పటి వరకు ఏ కోర్టు దోషిగా తేల్చలేదన్నారు. తనను ఎందుకు అరెస్టు చేశారని అడగాలనుకుంటున్నానన్నారు. కేవలం నలుగురి ప్రకటనల్లోనే తన పేరు కనిపించిందని చెప్పారు. ఈడీ రూ.100కోట్ల ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈడీ విచారణ తర్వాతే అసలైన మద్యం కుంభకోణం ప్రారంభమైందని కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని నాశనం చేయడమే ఈడీ లక్ష్యమని.. ఈడీ బెదిరింపులకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

ఈడీ దోపిడీ రాకెట్‌ సాగుతోందని కేజ్రీవాల్‌ అన్నారు. కేజ్రీవాల్‌ ప్రకటనను ఈడీ వ్యతిరేకించింది. గోవా ఎన్నికలకు హవాలా ద్వారా డబ్బులు వినియోగించారని ఈడీ తెలిపింది. కేజ్రీవాల్ మొత్తం విచారణను గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారని.. ఈ అంశం ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని ఈడీ పేర్కొంది. గోవా ఎన్నిక‌లకు రూ.100కోట్ల సొమ్మును ఆమ్ ఆద్మీ పార్టీకి అందినట్లుగా ఈడీ ఆరోపించింది. మొబైల్ డేటాను రిక‌వ‌రీ చేసిన‌ట్లు ఈడీ పేర్కొంది. పలు డివైజ్‌లలో ఉన్న డేటాను రికవరీ చేయాల్సి ఉంది పేర్కొంది.