medipally satyam
తెలంగాణ రాజకీయం

కేటీఆర్, హరీష్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారు

కేటీఆర్, హరీష్ రావు నీతిమంతుల్లా మాట్లాడుతున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పార్లిమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ కనుమరుగు కాబోతుంది. కల్వకుంట్ల కుటుంబ నేతలను మించిన పవర్ బ్రోకర్లు ఇంకెవరు లేరు. పది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. తాము చేస్తే సంసారం..వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం లా హరీష్ రావు,కేటీఆర్ ప్రవర్తిస్తున్నారు. బిఆర్ఎస్ పాలనలో సొంత పార్టీ ఎమ్మెల్యే,ఎంపిలను కూడా కలవని నీచ చరిత్ర కేసీఆర్ దని అన్నారు.
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవలని సీఎం రేవంత్ రెడ్డి తలచుకుంటే 24గంటల్లో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఖాళీ అవుతారు. తెలంగాణ భవన్ అయిన పార్టీ ఆఫీస్ ను మూసివేసి స్టార్ హోటల్ గా మార్చి బిజినెస్ చేసుకుంటే హరీష్,కేటీఆర్ కి మంచిదని అన్నారు.