ED-kavita
జాతీయం తెలంగాణ రాజకీయం

4కు కవిత బెయిల్ పిటీషన్

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 4కి వాయిదా పడింది. ఏప్రిల్ 4న మధ్యాహ్నం 2:30కి రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. సుదీర్ఘ వాదనలు, ఈడీ రిప్లై రిజాయిన్డర్ కు అభిషేక్ మను సింఘ్వి మరింత సమయం కోరారు. దాంతో కవిత తరపు న్యాయవాదులు ఏప్రిల్ 3న సాయంత్రానికి రిజాయిన్డర్ దాఖలు చేస్తామని తెలిపారు. కుమారులకు పరీక్షలు ఉన్నాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే.