ఏపీలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. సగటు ఉష్ణోగ్రత 40డిగ్రీలను దాటేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. ఏపీలో పలు మండలాల్లో వడగాల్పులు, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలురాష్ట్రంలోని నెల్లూరు, కావలి, తుని, అనంత పురం, కర్నూలు, మచిలీపట్నం, ఒంగోలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమో దయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా 1 పాణ్యంలో 43.7, కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామీణ మండలాల్లో 43.3, తిరుపతిజిల్లా గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.రానున్న రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణో గ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావ రణ కేంద్రం ప్రకటించింది. సోమవారం అనకాపల్లి, విజయ నగరం, నంద్యాల జిల్లాల్లోని ఒక్కో మండలంలో తీవ్రంగా వడగాలులు వీచాయి.
మంగళ, బుధవారాల్లో అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మ నాధ్ తెలిపారు. వడగాలులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మంగళ, బుధవారాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకటించారు. సోమవారం 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వెల్లడించారు. ఎండలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సోమవారం ఏపీలోని 670 మండలాల్లో 6 మండలాల్లో తీవ్ర వడగాల్పులు నమోదయ్యాయి. మరో 37 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. 627మండలాల్లో ఉష్ణోగ్రతలు ఉన్నా, వేడిగాలులు మాత్రం లేవు.మంగళవారం కూడా 10మండలాల్లో వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40డిగ్రీలను మించి నమోదు అవుతున్నాయి.
విజయనగరం జిల్లా వేపాడాలో 42.1డిగ్రీలు, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 42.1 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 42డిగ్రీలు, నాతవరంలో 40.1డిగ్రీలు, గోలుగొండలో 40.9డిగ్రీలు, కర్నూలు జిల్లా గూడూరులో 42.23 డిగ్రీలు, కర్నూలు మండలంలో 43.3 డిగ్రీలు, నంద్యాల జిల్లా పాణ్యంలో 43.7 డిగ్రీలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 41డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సగటు ఉష్ణోగ్రత 40డిగ్రీలుగా ఉంది.ఎండ వేడిమి, వడగాల్పులు అధికం అవుతున్న నేపధ్యంలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను,జిల్లా కలక్టర్లను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.ఉపాధి హామీ పనులను ఉ.10.30 గం.లోపు పూర్తి చేసేలా, కూలీలు పనిచేసే చోట్ల తాగునీరు, తగిన నీడ ఉండే విధంగా చూడడం తోపాటు మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.పాఠశాలలకు ఎలాగు ఒంటిపూట బడులు జరుగుతున్నందున విద్యాశాఖ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
వడగాల్పులపై ప్రజలకు ముందుగానే తగిన హెచ్చరికలు జారీ చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రజల్లో ముఖ్యంగా పెద్దఎత్తున ప్రచారం చేసి అవగాహన కల్పించాలని సూచించారు.