harish
తెలంగాణ ముఖ్యాంశాలు

చందాపూర్ బాధితులను పరామర్శించిన హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా  చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో చనిపోయిన, గాయపడిన కార్మికుల బంధువులను  మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. యాజమాన్యం పట్టించుకోవడం లేదని నిరసన తెలుపుతున్న బాధితులతో అయన  మాట్లాడారు. తరువాత కలెక్టర్ తో ఫోన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. తమిళనాడు, మధ్యప్రదేశ్కు చెందిన మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల, యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్  చేసారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చి పంపించాలని అన్నారు.