congress-thukkuguda
తెలంగాణ రాజకీయం

తుక్కుగూడ లో కాంగ్రెస్ జన గర్జన చారిత్రాత్మం కానుంది

సభ వేదిక వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. భట్టి మాట్ఆడుతూ తుక్కుగూడ జన గర్జన సభ ఈ దేశానికి దిశా నిర్దేశం చేయనుంది. దేశంలోనే ఈ సభ చారిత్రాత్మకం కానుంది. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను తుక్కుగూడ సభనుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుంది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం మన అందరిదీ స్వేచ్ఛగా,  స్వతంత్రంగా బతికే ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అవాస్తవాలు మాట్లాడే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా కూడా పనికిరాదు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ నాయకులు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా. దేశ భద్రతకు వాడాల్సిన కమ్యూనికేషన్ వ్యవస్థను గత పాలకులు వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. దేశ భద్రతకు ప్రమాదం తెచ్చారు. వ్యక్తిగత కుటుంబ జీవితాలు, వ్యాపారాలు, అధికారులు, జడ్జీలు ఏం మాట్లాడుకుంటున్నారో నిబంధనలకు విరుద్ధంగా తెలుసుకున్నారు. జరిగిన నష్టానికి పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటాం. జూన్ మాసంలో వచ్చిన వర్షాలను కేసీఆర్ ఒడిసి పట్టలేదు. అవసరం లేకున్నా గొప్పల కోసం నాగార్జున సాగర్ నీటిని కిందికి వదిలారు, నిర్మాణ లోపంతో కాలేశ్వరం లో గోదావరి నీటిని కిందికి వదలవలసి వచ్చింది కెసిఆర్ తప్పిదాల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి,  సంకల్పబలంతో ఇచ్చిన హామీలు అమలు చేస్తుందో తెలంగాణ మోడల్ గా తుక్కుగూడలో ఏఐసీసీ నాయకత్వం సందేశం ఇవ్వబోతోంది. ఇది గర్వకారణంగా భావిస్తున్నామని అన్నారు.

తుక్కుగూడ సభనుంచే ఎఐ సిసి అధ్యక్షుడు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లు ఇచ్చిన 6 గ్యారంటీలను దేశమే ఆశ్చర్యపోయేలా అమలు చేస్తున్నాం.  హామీల అమలులో ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమే అని భావించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తెచ్చాం, నిరుపేదల ఆరోగ్యం కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. కెసిఆర్ మాదిరిగానే హామీలు అమలు చేయకుండా దిగిపోతారని అనుకున్నారు. ఎవరి ఊహకు అందని విధంగా అడగకముందే 500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు భారతదేశం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా అమలు చేశాము. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దశాబ్ద కాలం పాటు కాల్పనిక కథలు చెప్పింది. వీళ్లు కూడా అలాగే ఉంటారు అనుకోకుండా భద్రాచల సీతారామచంద్రస్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో పూజ చేసి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ప్రకటించామని అన్నారు.
ఒక అడుగు ముందుకు వేసి ఊహలకు అందని విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందించాలని నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన డిసెంబర్ 7 నుంచి మొదలు హైదరాబాద్ సభ వరకు డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణం మొత్తం లెక్కగట్టి చెక్కు రూపంలో అందజేశాం. అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన వర్కర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నాం. ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి కేవలం మూడు నెలల్లోనే 64.75 లక్షల మంది రైతులకు రైతుబంధు మొత్తాన్ని వారి ఖాతాల్లో నమోదు చేశాం. మీలాగా 8 నెలలు తీసుకోలేదని లెక్కలు చెబితే బీఆర్ఎస్ నేతలు నోరు మూసుకున్నారు.రైతు బీమా కింద పదిహేను వందల కోట్ల ప్రీమియం ప్రభుత్వమే చెల్లించింది. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు అందజేస్తున్నాము. మూసీ నదిని పునర్జీవింపజేసి లండన్ లోని  థేమ్స నదిని మరిపించే ప్రణాళికను సిద్ధం చేశాం. హైదరాబాద్ మెట్రో విస్తరణ చేపట్టాం. ధరణి వ్యవస్థను సర్వనాశనం చేసి రైతులను ఇబ్బంది పెడితే సమస్యలకు పరిష్కారాలు చూపిస్తున్నామని అన్నారు.
ఫామ్ హౌస్ లో మూడు నెలలు పడుకొని బయటికి వచ్చి కరెంటు లేదంటూ మాట్లాడుతున్నారు.

భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు పనికిరాని సబ్ క్రిటికల్ టెక్నాలజీని వాడారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను బోగ్గు రవాణా ప్రాంతం నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. డిస్కమ్ లు, జెన్కోలు మీ పాలనలో కుప్పకూలిపోయాయి.  కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థను సరిచేసి క్షణం కూడా కరెంటు పోకుండా చూస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందజేస్తున్నారు. 2030-31 వరకు పిక్ డిమాండ్ ను అందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశాం.  30 వేల ఉద్యోగాలు మూడు నెలల్లో ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం, అదనపు పోస్టులు కలిపి గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశాము.
హైదరాబాద్ ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. హైదరాబాదులో డ్రగ్స్ మాట వినిపిస్తే తాటతీస్తాం.

హైదరాబాద్ లో ఉన్న  బిడ్డలు నిశ్చింతగా ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరంగల్ నుంచి మహబూబ్నగర్ వరకు తుక్కుగూడ సభకు కదలి రావాలి. ప్రజాస్వామ్యం, హక్కుల పరిరక్షణ అంటే ఏమిటో ఈ దేశానికి జన గర్జన సభ ద్వారా చాటాలని అన్నారు.