babu jagjivan ram
తెలంగాణ

టీటీడీపీ కార్యాలయంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

శుక్రవారం ఎన్టిఆర్ భవన్లో బాబూ జగ్జీవన్రామ్ గారి జయంతి కార్యక్రమం తెలంగాణ తెలుగుదేశం పార్టీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోలంపల్లి అశోక్ అధ్యక్షత వహించారు. బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పుష్పాలను అర్పించి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ… జగ్జీవన్రామ్ గారు చదువుకునే రోజులలో పాఠశాలలో మంచి నీళ్లు త్రాగడానికి హిందువులకు ఒక కుండ, ముస్లింలకు మరొక కుండ అని రెండు కుండలను పెట్టేవారు. హిందువుల నీటి కుండలో బాబు జగ్జీవన్రామ్ మంచినీళ్లు త్రాగితే హిందువుల అగ్ర కులాలలోని కొంత మంది వెళ్లి బాబూ జగ్జీవన్రామ్ త్రాగిన నీటి కుండను పగలగొట్టారు. అప్పుడు జగ్జీవన్రామ్ గారు స్కూల్ మాస్టారు దగ్గరకు వెళ్లి ఈ విధానంపై కొట్లాడగా అప్పుడు మూడు కుండలను, ఒకటి హిందువులకు అని, రెండోది ముస్లింలకు అని, మూడో కుండ గిరిజనులకు అని, మూడు కుండలను ఏర్పాటు చేయించారు. బాబూ జగ్జీవన్రామ్కు మళ్లీ కోపంవచ్చి ఆ మూడు కుండలను పగలగొట్టారు. అక్కడి నుంచే ఆయన తోటి విద్యార్థులను కలుపుకుని ఉద్యమాన్ని మొదలుపెట్టారు. విద్యార్థి దశ నుంచే బాబూ జగ్జీవన్రామ్ పోరాట పటిమకు ఇది నిదర్శనం.

ఒకే కుండను ఏర్పాటు చేయించి అన్ని కులాల వారు మంచినీరు త్రాగే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప మనసున్న, పోరాట పటిమ కలిగిన నాయకుడు బాబూ జగ్జీవన్రామ్. అంతే కాకుండా రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి సలహాలు ఇచ్చారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలకు చట్టబద్దత కల్పించడానికి తన వంతు కృషి చేశారు. టీడీపీ`టీఎస్కు ఉనికి లేదని కొంత మంది అంటున్నారు. అటువంటి వారికి కనువిప్పు కలిగించడానికి బాబూ జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఉందని ప్రజల్లోకి వెళ్దామని అన్నారు.
రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి, సూర్యదేవర లత మాట్లాడుతూ… బాబూ జగ్జీవన్రామ్ బడుగు, బలహీనవర్గాల సమస్యలపై పోరాటం చేసిన క్రమశిక్షణ కలిగిన గొప్ప నాయకుడు. ప్రజలలో ఐక్యతాభావాన్ని పెంపొందించడానికి బాబూ జగ్జీవన్రామ్ విశేషకృషి చేశారు. ఆయన కుమార్తె లోక్సభ స్పీకర్గా పని చేయడం జరిగింది. ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మనకు తెలిసిన నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పని చేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి అందరం కృషి చేద్దాం.
ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, పోలంపల్లి అశోక్ మాట్లాడుతూ… బాబూ జగ్జీవన్ రామ్ చిన్నతనంలోనే దుర్బరమైన అంటరాని తనాన్ని అనుభవించారు. ఈ అనుభవంతోనే అస్పృశ్యకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. స్వాతంత్య్ర పోరాటం పాల్గొని జైలుకువెళ్లారు. కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా పని చేసి పరిపాలనా దక్షుడిగా పేరొందారు. ఆయనకు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం కూడా వచ్చింది. దళితుడు ప్రధాని కావద్దని ఆయనను కొందరు అడ్డుకోవడం జరిగింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలు అయ్యేందుకు పార్లమెంట్లో తన గొంతకను సమర్థవంతంగా వినిపించారు. దళితులకు ఆయన ఎన్నో విధాలుగా సేవ చేశారు. దేశం అభివృద్ధి పథంలో నడవడానికి దోహదపడ్డారు. బాబూ జగ్జీవన్రామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి అందరం కృషి చేద్దామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మండూరి సాంబశివరావు,  రాష్ట్ర కార్యదర్శి నర్సింగ్రావు, నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి యాతాకుల అంజయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడెపు రాఘవులు, ఎస్సీ కమిటీ సభ్యులు మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.