ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఆ క్రికెటర్ ను కోటీశ్వరుణ్ణి చేసింది. అతడు కూడా ఐపీఎల్ లో అనామక జట్టుకు కాకుండా.. పేరొందిన జట్టుకే ఎంపికై ఆడాడు. తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ అనేది క్యాష్ రీచ్ లీగ్ కాబట్టి.. అతని ఆటకు మేనేజ్మెంట్ ఫిదా అయింది. ఇంకేముంది డబ్బులే డబ్బులు. ఇటు పేరుకు పేరు. ఫలితంగా ఆ ఆటగాడు తన స్థాయికి తగ్గట్టుగా ఇంటిని కొనుగోలు చేశాడు. అది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఐపీఎల్ లో ఎందరు స్టార్ క్రికెటర్లు ఉన్నా పృథ్వీ షా స్థానం మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే అతడు జట్టులో స్థానం కోసం ఎంతో కష్టపడ్డాడు. తనను తాను నిరూపించుకున్నాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటి చేత్తో గెలిపించాడు. అయితే ఇన్నాళ్లకు ఆర్థికంగా స్థిరపడటంతో.. తను ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశాడు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సముద్రానికి దగ్గరలో ఉండే ఒక ఫ్లాట్ కొనుగోలు చేశాడు. అంతేకాదు ఫ్లాట్ కొనుగోలు చేసిన అనంతరం ఎమోషన్ అయిపోయాడు. “ఈ ప్రదేశం గురించి ఎన్నో కలలుగన్నాను.
వాటిని ఇప్పుడు నిజం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నాకంటూ సొంత ఇల్లు ఉండాలనేది ఎప్పటి నుంచో ఒక కల. అది ఇప్పుడు నిజమైంది. సొంత ఇల్లు అనేది స్వర్గం లాంటిది. ఇకమీదట అంతా మంచే జరుగుతుందంటూ” రాసుకొచ్చాడు. ప్రస్తుతం అతడి సొంత ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక పృథ్వీ షా ఫ్లాట్ చూసిన నెటిజన్లు.. ఇల్లు అద్భుతంగా ఉందని అంటున్నారు. అంతా మంచే జరగాలని అభిలాషిస్తున్నారు. ప్లాట్ నిర్మాణం చాలా బాగుందని.. ముంబై లాంటి ప్రాంతంలో సరైన ఎంపిక అని కొనియాడుతున్నారు..పృథ్వీ షా టీమిండియాలోకి 2018లో వచ్చాడు. ఓపెనర్ గా ఆడుతూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే తన స్థానాన్ని జట్టులో సుస్థిరం చేసుకోవడంలో విఫలమయ్యాడు.
గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ అవి సఫలం కావడం లేదు. దేశవాళి క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ సెలెక్టర్లు అతడిని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇటీవల అతడు గాయపడ్డాడు. దాని నుంచి కోరుకున్నాడు. రంజి ట్రోఫీలో అదరగొట్టాడు. ముంబై జట్టు కప్పు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్ లో ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు ఆడుతున్నాడు. మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. ఇప్పటిదాకా ఆడిన మూడు మ్యాచ్ లలో 119 పరుగులు చేశాడు.