ఏపీలో ఏప్రిల్ 12న విడుదల చేసిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఎప్పటిలాగా కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలు నిలిచాయి. కృష్ణా జిల్లా 84 శాతం ఉత్తీర్ణతతో ‘టాప్-1’లో నిలిచింది. ఇక గుంటూరు జిల్లా 81 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో, 79 శాతం ఉత్తీర్ణతతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజు వివరాలను అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి, పరీక్షల కన్వీనర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.
రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఇంటర్ పరీక్షలకు సంబంధించి ప్రథమ సంవత్సరం పరీక్షలకు 5,17,617 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 5,35,056 మంది అభ్యర్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. వీరిలో 9,99,698 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తికాగా.. విద్యార్థుల మార్కులను అప్‌లోడ్ చేసిన అధికారులు ఏప్రిల్ 12న ఫలితాలను వెల్లడించారు.
ఏపీ ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
Step 1: ఏపీ ఇంటర్ విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://bie.ap.gov.in/ సందర్శించండి
Step 2: హోం పేజీలో ఏపీ ఇంటర్ రిజల్ట్స్ 2024 లింక్ (Andhra Pradesh Inter Results 2024 link) మీద క్లిక్ చేయండి
Step 3: హాల్ టికెట్ నెంబర్ (రిజిస్ట్రేషన్ నెంబర్), పుట్టిన తేదీ లాంటి వివరాలు నమోదు చేయాలి
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోండి
Step 6: ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీల ప్రవేశాల సమయంలో మీ ఇంటర్ స్కోర్ కార్డు అవసరాల కోసం రిజల్ట్ ు ప్రింటౌట్ తీసుకోవడం బెటర్.
ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లు..
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల డైరెక్ట్ లింక్
ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల డైరెక్ట్ లింక్
https://resultsbie.ap.gov.in/
https://bieap.apcfss.in/
https://www.manabadi.co.in/