కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో మొదటి నుంచి వైసీపీ ఎత్తులు వేస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా గాడిలో పడిపోతుంది. మొన్నటి వరకూ కోటి రూపాయల మద్యంతో రాజకీయం చేద్దామనుకుంటే, అది కాస్త అధికారుల కళ్లకు చిక్కడంతో దెబ్బ తగిలింది. తాజాగా నామినేషన్ల ఆఖరి రోజు సింబల్స్ కేటాయింపు సందర్భంగా అనూహ్యంగా గాజు గ్లాసును పోలిన సింబల్‌ను ఓ అభ్యర్థికి కేటాయించడానికి నానా అవస్థలు పడినప్పటికీ అది కాస్త విఫలం కావడంతో వైసీపీ ఎత్తు చిత్తయ్యింది. పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ, సింబల్స్ కేటాయింపుకు సంబంధించి ఆఖరి రోజు సోమవారం ప్రక్రియ నిర్వహించారు. తెలుగు జనతా పార్టీ అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తనకు పెన్‌స్టాండ్ సింబల్ కావాలని ఆర్వోను కోరారు. అయితే నామినేషన్ పత్రం దాఖలు చేసినప్పుడు ఆయన కోరిన గుర్తులలో పెన్ స్టాండ్ గుర్తు పెట్టుకోలేదు. ఆ తర్వాత ఆయన లేఖ ద్వారా తనకు పెన్ స్టాండ్ సింబల్ కావాలని కోరారు. దీనిపై పరిశీలిస్తామని చెప్పి, ఇతర పార్టీ నేతలను పిలిచి ఆర్వో చర్చించారు.
దీంతో అనుమానం వచ్చిన జనసేన నాయకులు అభ్యంతరం తెలిపారు. నామినేషన్ పత్రంలో ఆప్షన్ పెట్టకుండా, ఉన్నట్టుండి గుర్తు కావాలని లేఖ ఇస్తే కేటాయింపు ఎలా చేస్తారని జనసేన నాయకులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరడంతో ఆర్వో రూల్ పుస్తకం పరిశీలించి పెన్‌స్టాండ్ ఇవ్వడం కుదరదని చెప్పారు. నామినేషన్ పత్రంలో కోరిన సింబల్స్‌లో ఉన్న మైక్ గుర్తును కేటాయించారు. దీంతో అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు పోటీ చేయకుండా జనసేన అడ్డుపడుతోందని ఆరోపించారు. తనకు ఆర్వో పెన్ స్టాండ్ గుర్తు కేటాయిస్తున్నట్టు మొదట చెప్పారని, జనసేన నాయకులు అడ్డుకోవడంతో తనకు ఆ గుర్తు కేటాయించలేదన్నారు. ఇది ముమ్మాటికి బీసీలపై జనసేన దాడిగా పెద్దింశెట్టి అభివర్ణించారు. బీసీలను అణగదొక్కే కుట్ర అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.మొదట మూడు ఆప్షన్లలో పెన్ స్టాండ్ ను కోరని తెలుగు జనతా పార్టీ అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అనూహ్యంగా నామినేషన్లు ఉపసంహరణ రోజున తెరపైకి పెన్ స్టాండ్ గుర్తు కావాలని పట్టుబట్టడం ఎంత వరకూ సమంజసమని జనసేన జాతీయ మీడియా సలహాదారు వేములపాటి అజయ్ అన్నారు. ఆయన వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు.
ఆప్షన్లలో నమోదు చేయకుండా గ్లాస్ సింబల్‌ను పోలిన పెన్ స్టాండ్ సింబల్ కోరడం చూస్తుంటే, ఓట్లు చీల్చాలనే ఎత్తుగడ అన్నారు. వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని కావాలని నిలిపారని, పెద్దింశెట్టికి అనుకూలంగా వైసీపీ కార్యకర్తలు ఆర్వో కార్యాలయానికి రావడం చూస్తుంటే వైసీపీ ఎత్తులు అర్థమవు తున్నాయన్నారు. పవన్‌పై ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నుండి పవన్ భారీ మెజార్టీతో గెలవ బోతున్నారన్నారు. సింబల్ కేటాయింపు అంశంలో ఆర్వో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ వ్యూహం బెడిసి కొట్టింది. జనసేన పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో మొదటి నుంచి వైసీపీ ఎత్తులు వేస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా గాడిలో పడిపోతుంది. మొన్నటి వరకూ కోటి రూపాయల మద్యంతో రాజకీయం చేద్దామనుకుంటే, అది కాస్త అధికారుల కళ్లకు చిక్కడంతో దెబ్బ తగిలింది. తాజాగా నామినేషన్ల ఆఖరి రోజు సింబల్స్ కేటాయింపు సందర్భంగా అనూహ్యంగా గాజు గ్లాసును పోలిన సింబల్‌ను ఓ అభ్యర్థికి కేటాయించడానికి నానా అవస్థలు పడినప్పటికీ అది కాస్త విఫలం కావడంతో వైసీపీ ఎత్తు చిత్తయ్యింది.
పిఠాపురం నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ, సింబల్స్ కేటాయింపుకు సంబంధించి ఆఖరి రోజు సోమవారం ప్రక్రియ నిర్వహించారు. తెలుగు జనతా పార్టీ అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తనకు పెన్‌స్టాండ్ సింబల్ కావాలని ఆర్వోను కోరారు. అయితే నామినేషన్ పత్రం దాఖలు చేసినప్పుడు ఆయన కోరిన గుర్తులలో పెన్ స్టాండ్ గుర్తు పెట్టుకోలేదు. ఆతర్వాత ఆయన లేఖ ద్వారా తనకు పెన్ స్టాండ్ సింబల్ కావాలని కోరారు. దీనిపై పరిశీలిస్తామని చెప్పి, ఇతర పార్టీ నేతలను పిలిచి ఆర్వో చర్చించారు. దీంతో అనుమానం వచ్చిన జనసేన నాయకులు అభ్యంతరం తెలిపారు. నామినేషన్ పత్రంలో ఆప్షన్ పెట్టకుండా, ఉన్నట్టుండి గుర్తు కావాలని లేఖ ఇస్తే కేటాయింపు ఎలా చేస్తారని జనసేన నాయకులు ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కోరడంతో ఆర్వో రూల్ పుస్తకం పరిశీలించి పెన్‌స్టాండ్ ఇవ్వడం కుదరదని చెప్పారు. నామినేషన్ పత్రంలో కోరిన సింబల్స్‌లో ఉన్న మైక్ గుర్తును కేటాయించారు. దీంతో అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు పోటీ చేయకుండా జనసేన అడ్డుపడుతోందని ఆరోపించారు.
తనకు ఆర్వో పెన్ స్టాండ్ గుర్తు కేటాయిస్తున్నట్టు మొదట చెప్పారని, జనసేన నాయకులు అడ్డుకోవడంతో తనకు ఆ గుర్తు కేటాయించలేదన్నారు. ఇది ముమ్మాటికి బీసీలపై జనసేన దాడిగా పెద్దింశెట్టి అభివర్ణించారు. బీసీలను అణగదొక్కే కుట్ర అన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా మన్నారు. మొదట మూడు ఆప్షన్లలో పెన్ స్టాండ్ ను కోరని తెలుగు జనతా పార్టీ అభ్యర్థి పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు అనూహ్యంగా నామినేషన్లు ఉపసంహరణ రోజున తెరపైకి పెన్ స్టాండ్ గుర్తు కావాలని పట్టుబట్టడం ఎంత వరకూ సమంజసమని జనసేన జాతీయ మీడియా సలహాదారు వేములపాటి అజయ్ అన్నారు. ఆయన వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు. ఆప్షన్లలో నమోదు చేయకుండా గ్లాస్ సింబల్‌ను పోలిన పెన్ స్టాండ్ సింబల్ కోరడం చూస్తుంటే, ఓట్లు చీల్చాలనే ఎత్తుగడ అన్నారు.
వైసీపీకి అనుకూలంగా ఉండే వ్యక్తిని కావాలని నిలిపారని, పెద్దింశెట్టికి అనుకూలంగా వైసీపీ కార్యకర్తలు ఆర్వో కార్యాలయానికి రావడం చూస్తుంటే వైసీపీ ఎత్తులు అర్థమవుతున్నాయన్నారు. పవన్‌పై ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నుండి పవన్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారన్నారు. సింబల్ కేటాయింపు అంశంలో ఆర్వో తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు