స్థానిక ఎమ్మెల్యే పై జరిగిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యపై ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఘాటుగా స్పందించారు. పార్టీలు మారిన వారికి మీ పార్టీలో టికెట్ లేదంటావ్.. నాలుగు పార్టీలు మారిన పంచకర్ల రమేష్ బాబును నీ పార్టీలో చేర్చు కున్నావ్..యలమంచిలిలో పంచకర్ల రమేష్ బాబుమైనింగ్ ద్వారా రోజుకు రూ.6 లక్షలు దోచుకున్నాడని నువ్వే అన్నావ్.. మళ్లీ రమేష్బాబు మంచివాడు గెలిపించండని నువ్వే అంటావని అన్నారు.
ఎక్కడికెళ్లినా పిచ్చి మాటలు.. స్క్రిప్ట్ డైలాగులు చెప్పడంతప్పా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి మరోకటి తెలియదని’ పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ విమర్శించారు. స్క్రిప్టు చదవడం మానినిజాలు తెలుసుకుని పవన్ కల్యాణ్ మాట్లాడాలనిహితవు పలికారు. పెందుర్తి మండలం రాంపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అదీపాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..పెందుర్తి బహిరంగ సభలో పవన్ కల్యాణ్ తనపైనిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారని ఖండించారు.
2019 ఎన్నికల సమయంలోఎలమంచిలి లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పంచకర్ల రమేష్ బాబుమైనింగ్ ద్వారా రోజుకు రూ.6 లక్షలు సంపాదించారని పవన్ కల్యాణ్ అనలేదా అని ప్రశ్నించారు.అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చిఇప్పుడు గెలిపించాలని ఎలా అంటారని ప్రశ్నించారు. పెందుర్తిలో తాను వసూళ్లు చేస్తున్నాననిచెబుతున్న పవన్ కల్యాణ్ను చూస్తే జాలి వేస్తుందన్నారు. సర్పంచ్ గా ఉన్ననాటి నుంచి ఇప్పటివరకుపేదలు ఇళ్లు కట్టుకుంటే సహాయం చేశానని.. ఆవిషయం ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు.తనసేవా గుణంనియోజకవర్గంలోని ప్రజలందరికీతెలుసు అని చెప్పారు. రాజకీయాల్లో హుందా తనంఉండాలని.. జనసేన, టీడీపీ వల్ల రాజకీయాలుభ్రష్టుపట్టాయని విమర్శించారు. వైఎస్సార్సీపీనాయకులు గూండాలు అని చెబుతున్న పవన్కల్యాణ్..ఇటీవల పెందుర్తిలో జరిగిన జనసేననాయకుల ఆగడాలను ఒక్కసారి తెలుసుకోవాలనిహితవు పలికారు. 88వ వార్డు టీడీపీ కార్పొరేటర్,బీసీ నాయకుడు మొల్లి ముత్యాల నాయుడును పంచకర్ల రమేష్ బాబు అనుచరుడు గల్లా శ్రీనివాసరావు అందరి ముందు కొట్టిన సంగతి పంచకర్లపవన్ కల్యాణ్కు చెప్పలేదా అని ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తామని కలలు కంటూ రౌడీయి జంచేస్తున్న జనసేన నాయకులు గూండాలా.. ప్రజలకునిరంతరం సేవలు అందిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు గూండాలా అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎవరి పని వారు చేసుకుంటే మంచిదని.. లేకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.