ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పోలింగ్ కు పోలీసులు సిద్దం

లోక్ సభ ఎన్నికలకు పటిష్టమైన బంద్ బస్త్ ఏర్పాటు చేసాము. ఎల్లుండి 7 నుండి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుందని రాచకొండ సిపి తరుణ్ జోషి అన్నారు.. దేశంలోనే అతి పెద్ద కమిషనరేట్ రాచకొండ
కమిషనరేట్. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5 పార్లమెంట్ కాంస్టిట్యూఎన్సీ, 13 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 3396 పోలింగ్ స్టేషన్స్ , 1590 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి , అందులో 533 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, 188 క్రిటికల్ లొకేషన్స్ ఉన్నాయి. రాచకొండ పోలీస్ కమిషనరేట్లో 328 రూట్లు 8 డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ 3 స్ట్రాంగ్ రూమ్స్/ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి. కమిషనరేట్ పరిధిలో మొత్తం సుమారు 60 లక్షలు జనాభా ఉండగా అందులో 35 లక్షల 27 వేల 441 ఓటర్లు ఉన్నారు. మార్చ్ 16 ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటివరకు 11.9 కోట్ల క్యాష్, 75లక్షలు విలువ చేసే 12,240 లీటర్ల లిక్కర్,14.7 లక్షలు విలువజేసే 245grms ప్రెసియోస్ మెటల్స్, ఒకటి పాయింట్ 9 5 కోట్లు విలువచేసే డ్రగ్స్, 9.26 లక్షలు విలువ చేసే ఫ్రీ బీస్  సీజ్ చేసాము.

8 అంతర్ జిల్లా చెక్ పోస్టులు, 29 ఫ్లైయింగ్ స్క్వేర్స్ 25 స్టాటిక్  సర్వేలెన్స్ టీమ్స్ ఏర్పాటు చేసాము. ప్రజలలో ధైర్యం నింపడానికి ఇప్పటివరకు 114 ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. కమిషనర్ పరిధిలో  1114 లైసెన్స్ వెపన్స్ ఉండగా , ఇప్పటివరకు 806 డిపాజిట్ చేసుకున్నాము . మార్చి 16 ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇప్పటివరకు 1036 నాన్ బెయిలబుల్ వారెంట్స్  ఎగ్జిక్యూట్ చేసాము, 4892 మంది రౌడీషీటర్ లను మరియు అనుమానితులను బైండోవర్ చేశామని అన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించనందుకు ఇప్పటివరకు 14 కేసులు బుక్ చేసాము. అన్ని పోలింగ్ స్టేషన్స్ ను జియో ట్యాగింగ్ చేశాము, ఎన్నికల ప్రక్రియ మానిటర్ చేయటానికి 72మంది ఐటి ఆఫీసర్స్లను డిప్లొయ్
చేసాము. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి రాచకొండ పోలీస్ కమిషనరేట్ టీం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని అన్నారు.