జాతీయం రాజకీయం

ఆందోళనలతో పీవోకే

పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే) ఆందోళనలతో అట్టుడుకుతోంది. అవామీ యాక్షన్ కమిటీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ క్రమంలో ఓ పోలీసు  ఆందోళనకారులకు చిక్కాడు.  దీంతో అతడిని కొట్టి చంపేశారు. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 90 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ యాక్షన్ కమిటీకి చెందిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతంలో వ్యాపారాలు నిలిచిపోయాయి. ఆందోళనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు ఒక దశలో కాల్పులు జరిపాయి. స్థానిక మంగ్లా డ్యామ్ నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తమకు ఉచితంగా ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోధుమలపై రాయితీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ప్రాంతంలో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరింది. ధరలు భారీగా పెరిగాయి. దీంతో స్థానిక ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేశారు. వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది.ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరుపు తున్నారని పీవోకేలో ఉద్యమకారుడు అంజాద్ అయూబ్ మీర్జా తెలిపాడు.

కాల్పుల్లో ఇద్దరు చనిపోయాయని వెల్లడించాడు. పొరుగు దేశం(భారత్) జోక్యం చేసుకోవాలని కోరాడు. ఇక్కడ పరిస్థితులు దిగజారిపోయని పేర్కొన్నాడు. ఈ ప్రాంతానికి స్వాతంత్య్రం కల్పించాలని ప్రాధేయపడ్డాడు. జీలం నదిపై మంగ్లా ఆనకట్టను 1967లో నిర్మించారు. మీర్పుర్ జిల్లాలోని అత్యంత సార వంవతమైన భూములను తీసుకుని ఈ ఆనకట్ట నిర్మించారు. . ఇక్కడ భారీ ౖహె డ్రోపవర్ ప్లాంటు ఉంది. 1975 నాటికే డ్యామ్ నిర్మాణ ఖర్చులు వచ్చేశాయి. 2010లో ఇక్కడ 250 బిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. దీని ఆదాయం మొత్తం పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని స్థనిక ప్రభుత్వానికి రూపాయి కూడా ఇవ్వడం లేదు. డ్యామ్లో మొత్తం 1400 మెగా వాట్ల విద్యుత్ తయారవుతుంది. వీటిలో 300 మెగావాట్లను స్థానికంగా ఇస్తామని నాడు పాక్ ప్రభుత్వం పీవోకే ప్రభుత్వానికి మాట ఇచ్చింది. కానీ మాట తప్పి ఇక్కడి విద్యుత్ను పంజాబ్ రాష్ట్రానికి తరలిస్తోంది. మరోవైపు పంజాబ్ ప్రజలకన్నా స్థానికులు విద్యుత్కు అధిక ధర చెల్లిస్తున్నారు. ఇదే అసంతృప్తికి కారణమైంది.

మరోవైపు పాకిస్థాన్ పీవోకేలోని చెట్లను కూడా అక్రమంగా నరికివేస్తోందని పరిశోధకుడు డాక్టర్ షబ్బీర్చౌద్రీ తెలిపారు. దీంతో మట్టిపెళ్లలు విరిగిపడుతున్నాయని, వరదలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఏటా 300 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సరిపడా పువ్వులు, వన మూలికలు పండిస్తారు. వీటిని పాక్ కార్పొరేషన్లు విక్రయించుకుని సొమ్ము చేసుకుంటున్నాయి. స్థానిక ప్రభుత్వానికి ఇచ్చే నిధులపై ఎలాంటి రికార్డులు లేవు. ఇక నీలం లోయలో అమూల్యమైన రత్నాలు దొరుకుతాయి. పాకిస్థాన్ దాదాపు 40 బిలియన్ డాలర్లకుపైగా విక్రయించింది. అయినా కనీస సదుపాయాలు కల్పించడం లేదు. పాక్ ప్రభుత్వం ఆగడాలు పెరగడంతో తిరుగుబాటు మొదలైంది.