వైఎస్‌ఆర్ కాపు నేస్తం పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు రూ. 490. 86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ లబ్ధిదారు సీఎం వైఎస్ జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం తమకు అందిస్తున్న చేయూత గురించి ఆమె మాటల్లోనే..
‘‘జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పాఠ్యాంశంగా పెడితే పెద్ద పుస్తకం అవుతుంది అంటున్నారు మా పిల్లలు. సీఎం తీసుకొచ్చిన పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకం అందరికి పారదర్శకంగా.. అవినీతికి తావు లేకుండా ప్రతి రూపాయి లబ్ధిదారులకు చేరుతుంది. గతంలో ఎందరో ఎన్నో వాగ్దానాలు చేశారు.. కానీ నిలబెట్టుకోలేదు. కానీ సీఎం జగన్ ఒక్కసారి మాట ఇస్తే.. తప్పకుండా నిలబెట్టుకుంటారు’’ అని ప్రశంసించారు.
‘‘కరోనా వల్ల ప్రపంచ దేశాలన్ని భయపడుతున్నాయి. కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ప్రజల కష్టాలను మీరు తీసుకుని.. ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. గతంలో కొందరు కాపుల కోసం అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నారు. కానీ ఎవరు ఏం చేయలేదు. కానీ సీఎం జగన్ కాపులకు, ముఖ్యంగా కాపు మహిళలకు చేయూతనిస్తున్నారు. ఇంటికి దీపం ఇల్లాలు. కానీ సీఎం జగన్ అందరి ఇళ్లలో వెలుగు నింపుతున్నారు. రైతు భరోసా పథకాన్ని రెండేళ్ల నుంచి పొందుతున్నాను. ఉచిత బోరు చిన్నకారు రైతులకు ఎంతో మేలు చేస్తుంది. సీమలో నీటి ఎద్దడి గురించి అందరికి తెలుసు. కానీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక వర్షాలే వర్షాలు. రెండేళ్ల వరకు నీటికి సమస్యలేదు’’ అని తెలిపారు.
పశ్చిమగోదావరి ఏలూరు కలెక్టరేట్ నుంచి కాపు నేస్తం మహిళా లబ్దిదారు మాట్లాడుతూ.. ‘‘జగనన్న వచ్చిన తర్వాత మా కోసం నిధులు కేటాయించడం సంతోషం. గతంలో మాకోసం ఎవరూ చేయని ఆలోచన చేశారు. ఎవరూ రూపాయి ఇవ్వలేని టైమ్‌లో మీరు అమలు చేసిన పథకాలతో ఊపిరి తీసుకున్నాం. ఎలాంటి కష్టలేకుండా బ్రతుకున్నాం. డ్వాక్రా గ్రూప్‌లో చేరాం.. ఒక అన్నయ్య ఉన్నాడనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాం. కోవిడ్ టైమ్‌లో కూడా మీరు పథకాలు అమలు చేసి చూపించారు’’ అని ప్రశంసించారు. తూర్పు గోదావరి కలెక్టర్ నుంచి మరో మహిళా లబ్దదారు మాట్లాడుతూ.. ‘‘ఇంతవరకూ కాపుల కోసం ఎవరూ ఆలోచించలేదు. నా కాళ్ల మీద నేను బ్రతకగలను అనే భరోసా వచ్చింది. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు ఎలా బ్రతకాలనేది తెలియదు.. కానీ ప్రభుత్వం మా కోసం పథకాలు అమలు చేసిన తర్వాత బ్రతగలననే ధైర్యం వచ్చింది. కాపు నేస్తం ప్రవేశపెట్టడం కరోనా కష్టకాలంలో చాలా ఉపయోగపడింది. నాకు అమ్మ ఒడి పథకం కూడా అందింది. నాకు ఒక అన్నయ్య ఉన్నాడనే అనుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా కాపు మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.