భారతదేశ పద్దెనిమిదవ పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు నిబంధనల ప్రకారం రెమ్యూన రేషన్ చెల్లించాలని అడిగినందుకు ఉపాధ్యాయులపై సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లో లాఠీచార్జి చేయడం దారుణమని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి గంగధారి మహేష్, సర్వ సతీశ్ ,గొల్లపల్లి మహేష్ గౌడ్ లు సంయుక్తంగా మంగళవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు..
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉపాధ్యాయులపై లాఠీచార్జి చెయ్యడం అనేది ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న ఓడ దిగాక బోడి మల్లన్న అనే సామెత ను నిజం చేసినట్లు గా ఉందని ఎన్నో వ్యయప్రయసాలను ఇబ్బందులను ఎదుర్కొని 1951 సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి ఎన్నికల ను విజయవంతం చేయుట లో ఉద్యోగ,ఉపాధ్యాయుల కృషిని అభినందించాల్సిన చోట లాఠీలతో దెబ్బలు కొట్టించడం దారుణం అని చర్యగా ఆయన అభివర్ణించారు.
వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జరిగిన సంఘటన పై విచారణ చేసి బాద్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులు నిర్వహించిన వారికి ఒకే విధమైన
రెమ్యూనరేషన్ చెల్లింపు లో జరిగిన పొరపాట్ల ను సరిచేయలని,సిబ్బంది అందరికి డ్యూటీ సర్టిఫికెట్ అందేలా చూడాలని,అలాగే భవిష్యత్ లో ఎన్నికల నిర్వహణ ఎలా ఉంటే బాగుంటుందని ప్రస్తుతం జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన పొరపాట్ల పై అన్ని స్థాయిలోని సిబ్బంది తో సమీక్ష చెయ్యాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్ కుమార్,బోగ శ్రీనివాస్, జనార్దన్, విరబత్తని శ్రీనివాస్, బండారి సతీశ్,వంశీ, రవి,సుధాకర్, శంకర్, సాయిరెడ్డి, అభయ్ రాజ్, శ్రీనివాస్,విజయ్,నర్సయ్య తదితరులు పాల్గొన్నారు