తెలంగాణ రాజకీయం

పంట పండించే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం

తెలంగాణ రాష్ట్రంలో పంట పండించే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నానా రకాలుగా మోసం చేస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించితే.. నేడు రాష్ట్ర పరిస్థితి  పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైందని ఆవీదన వ్యక్తం చేసారు.గత 45 రోజులుగా రైతులు పండించిన ధాన్యాన్ని కల్లాల్లో పోసుకుని ఎదురుచూస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సమయానికి ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు.రాత్రింబవళ్లు ధాన్యం కుప్పల దగ్గర కాపలా కాస్తూ రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో తిప్పలుపడుతున్నారు. కొందరు పిడుగు పాటుతో మరణించిన ఘటనలు జరిగాయన్నారు.తాలు, తేమ పేరుతో బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు తీస్తూ గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని,40 కిలోల బస్తాకు 3 నుంచి 4 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారన్నారు.క్వాంటా చేసిన ధాన్యానికి రసీదు ఇవ్వాలి.

కాని, రైస్ మిల్లులకు పోయిన ధాన్యానికి సైతం రైస్ మిల్లర్లు 3 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని రాష్ట్రంలో ఈ మాఫియాను నడిపిస్తున్నది ఎవరు అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి రైతుల సమస్యల గురించి తీసుకెళ్లినా దీనిపై స్పందించకపోవడం శోచనీయమన్నారు.నిన్నమొన్నటిదాకా ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తా మంటూ బోగస్ మాటలు మాట్లాడుతున్నారు.గత ప్రభుత్వం చెల్లించాల్సిన రైతుబంధును సైతం ఇప్పటి ప్రభుత్వం నేటివరకు ఇవ్వలేదు. మరోవైపు కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే రైతులకు రైతుబంధు ఇస్తామంటూ పరిమితులు పెట్టి లీకులు ఇస్తున్నారు.రైతు దుక్కి దున్నడం నుంచి పంట చేతొకొచ్చే వరకు రైతులు అహర్నిశలు కష్టపడి ధాన్యాన్ని కాపాడుకుని కల్లాలకు తీసుకొస్తే.. కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు.అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసిపోయి రైతులు ధీనస్థితిలో పడిపోయారు.

రైతు రుణమాఫీ చేయలేదు.. రైతు కూలీలు, కౌలు రైతులకు రూ. 12 వేలు ఇవ్వలేదు.. కొనుగోలు కేంద్రాల నుంచి కోట్లాది రూపాయలు లంచాల రూపంలో చేతులు మారుతున్నాయి.వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదు.రైతులు కష్టించి పండించిన ధాన్యాన్ని అనేక కండిషన్లకు అమ్ము కోవాల్సిన దుస్థితి రావడం బాధాకరం.ప్రభుత్వం 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని తప్పుడు లెక్కలు చెబుతోంది. కల్లాల్లోని ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.ధాన్యానికి రూ.500 బోనస్‌ ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం.. సన్నవడ్లతో పాటు దొడ్డువడ్లకు కూడా ఇవ్వాలి.రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రూ.2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే చెల్లించాలి.రైతుల సమస్యలను పరిష్కరించే వరకు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా బిజెపి పోరాటం చేస్తుంది.