ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జుడీషియల్ రిమాండ్ ను కోర్టు మరింత పొడిగించారు. జూన్ 3 వరకూ కవిత రిమాండ్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ రిమాండ్ గడువు నేటితో ముగియడంతో తీహార్ జైలు అధికారులు కవితను వర్చువల్ గా రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. దీంతో కోర్టు జూన్ 3 వరకూ రిమాండ్ ను పొడిగించింది.ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత జుడీషియల్ రిమాండ్ గురించి విచారణ జరిగినట్లు తెలుస్తోంది. కవిత మార్చి నెలాఖరు నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ రెండు సంస్థలు కవితను అరెస్టు చేశాయి. మార్చి 15న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కవితను అరెస్టు చేయగా.. ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది.
అప్పటికే తిహార్ జైలులో రిమాండ్ లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసింది. దీంతో రెండు దర్యాప్తు సంస్థల తరపున కవిత రిమాండ్ లో ఉన్నారు.కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నించారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అవుతూ ఉన్న విషయం తెలిసిందే.