ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పల్నాడులో పుట్టకు  ఒకరు… చెట్టుకు ఒకరు

పల్నాడులో పోలింగ్ అనంతరం జరిగిన దాడులు రావ్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. మూక దాడులు, వాహనాల దహనం, రాళ్ళ దాడులు నుంచి పెట్రోల్ బాంబు దాడులతో దద్దరిల్లింది పల్నాడు. ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, ఆటవిక పాలనలో కొనసాగుతున్నామా  అన్న సంశయము కలిగించింది. ఈ ప్రతీకార దాడులు చూస్తుంటే పార్టీ నాయకులు ఫ్యాక్షన్ లీడర్లుగా మారారన్న భావన కలగక మానదు. పల్నాడు ప్రాంతంలో పోలింగ్ రోజు ఉద్రిక్తంగా ఉండటం సహజం. కానీ ఈ సారి ఈ ప్రాంతంలో ఎలక్షన్ తర్వాత హింస చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. పోలింగ్ జరుగుతున్న సమయంలో బూత్ ల పరిశీలనకు వచ్చిన నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలతో ప్రారంభమైన దాడి యత్నాలు ఆ తర్వాత మాచర్ల వైసపీ అభ్యర్థి పిన్నేల్లి రామకృష్ణా రెడ్డి, ప్రత్యర్థి టీడీపీ అబ్యర్థి జూలకంటి బ్రహ్మా రెడ్డి వరకు కొనసాగింది. సత్తెనపల్లి లో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ… వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు ఎదురు పడిన సందర్భంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

నర్సారావుపేట టీడీపీ అభ్యర్థి డా.అరవింద బాబు మునిసిపల్ హైస్కూల్  లో ಓటింగ్ సరళి పరిశీ లించేందుకు వెళ్ళిన సదర్బంలో వైసీపీ శ్రేణులు దాడి చేశారు. అప్పటికి పోలింగ్ సమయం పూర్తి కావడంతో ఇక గొడవలు ఉండవని భావించారు. ‌అయితే అంచనాలు తలకిందులు చేస్తూ ఒక్క సారిగా హింస చెలరేగింది.‌ పోలింగ్ సమయం ముగిసిన తర్వాత తంగిడి గ్రామంలో పెట్రోల్ బాబుల దాడితో ఉద్రిక్తతలు తలెత్తాయి. డా. అరవింద్ దాడికి ప్రతిగా వైసీపీ అబ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటిపై దాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. పొలీసులు కంట్రోల్ చేయలేక చివరకి రబ్బరు బుల్లెట్లు ఉపయోగించారు. తర్వాత టీడీపీ వాహనాలను  తగల బెట్టారు వైసీపీ నాయకులు. పారామిలిటరీ దళాలను రంగంలోకి దించవలసి వచ్చింది. కొత్త గణేషుంపాడులో వైసీపీకి ఓటు వేశారని దాడి చేయడంతో మగవాళ్ళు ఊరు వదిలి వెళ్ళారు. మహిళలు ఆ రాత్రి గుడిలో తలదాచుకున్నారు. ఈ ఘటన తెలిసి గురజాల ఎంఎల్ఏ కాసు మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్ పరామర్శకు వెళితే గ్రామస్తులు దాడికి దిగడంతో పోలీసులు అతి కష్టంగా ఇద్దరిని సేవ్ చేసి అక్కడ నుంచి పంపించి ఊపిరి పీల్చుకున్నారు‌‌.

ఇక అదే రోజు కారంపూడి లో విచక్షణారహితంగా వైసీపీ చేసిన దాడిలో వాహనాలు దహనమయ్యాయి. గ్రామంలో కనిపించిన వారిపై దాడి చేయడంలో బెంబేలెత్తిపోయారు ప్రజలు. దాడి చేయడానికి వచ్చిన వారు మారణాయుధాలతో తిరగుతున్న దృశ్యాలు సోషల్ మీడియా లో హల్ చల్ చేశాయి.ఈ విధంగా హింసాత్మక సంఘటనలు జరగడానికి కారణం ఏమిటి అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఒక పక్క రాష్ట్రంలో సమస్యాత్మామైన నియోజకవర్గాలు 11 ఉండగా అందులో 4 నియోజకవర్గాలు పల్నాడులో ఉన్నాయి. అవి మాచర్ల, గురజాల, నర్సారావుపేట, పెదకూరపాడు.. సమస్యాత్మక ప్రాంతాలకు కేంద్రం పారామిలిటరీ బలగాలను పంపింది. పల్నాడు ప్రాంతానికి కూడా అదనపు బలగాలు చేరుకున్నాయి. అయితే హింసాత్మక కార్యక్రమాలు యథేచ్ఛగా జరిగాయి. కేంద్ర బలగాలు పరిస్థితులను కంట్రోల్ చేయలేక పోయాయి.కేంద్ర బలగాలకు సపోర్టుగా తగినంత పోలీస్ సిబ్బంది లేకపోవడం కారణంగా చెబుతున్నారు. పోలింగ్ స్టేషన్లలో తగినంత భద్రతా సిబ్బంది లేకపోవడం.. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలోనూ ఒకరిద్దరే పోలీసులు ఉండటంతో పార్టీలో ఉన్న ఆల్లరి మూకలు రెచ్చి పోయారు.

గత  20 ఏళ్ళలో కనివిని ఎరుగని హింస చెలరేగింది. వివాదం మొదలైన సదర్బంలోనే దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన పోలీస్ అధికారులు నిర్లిప్తత వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గొడవలు నివారించేదుకు యాక్షన్ లోకి దిగితే నాయకుల ఆగ్రహానికిలోను కావలసి వస్తుందని పోలీస్ అధికారులు భావించారని ఒక వాదన. అధికారంలోకి వచ్చిన తర్వాత తమపై కక్ష సాదింపు చర్యలకు పూనుకుంటారేమో అన్న భయం వారిని వెంటాడిదన్న టాక్ నడుస్తోంది.ఇక నాయకుల తీరు ఏదోవిధంగా గెలవాలి అన్న దోరణిలో ఉంది…బలప్రయోగం, భయపెట్టి, రిగ్గింగు చేసి అయిన విజయం సాధించాలి అన్న పట్టుదల కనిపించింది….ఇక్కడ ప్రజా సేవ చేయ్యాలన్న ప్రేమ నాయకులలో లేదు…కేవలం ప్రకృతి ఒనరులను దోచేందుకే  అధికారం.‌‌ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఆక్రమ మైనింగ్, లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా,సున్నపురాయి వ్యాపారుల నుంచి భారీ వసూళ్ళ, ల్యాండ్ మాఫియా తెలంగాణ బోర్డర్ పక్కనే ఉండటంతో ఏపీలో  వివిధ ప్రాంతాల నుంచి వెళ్ళే గ్రానైట్ లారీకి ఇంతని  వసూలు ఇవ్వకపోతే కేసులు పెట్టించి బండిని సీజ్ చేయించడం అందిన కాడికి దోచు కోవడం కోసమే ఇక్కడి అధికాకం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి మారీ గెలుపు కోసం దాడులకు, హింసాత్మక కార్యక్రమాలకు వెనకాడరు..

ఎప్పుడూ పల్నాడులో పోలింగ్ అంటే అధికారులకు అగ్నిపరీక్షే. కానీ ఈ సారి పోలింగ్ తర్వాత  జరిగిన సంఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్ ను సస్పెండ్ చేసింది. కలెక్టర్ శివశంకర్ ను మార్చింది. పల్నాడు ప్రాంతంలో జరిగిన  హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది సీఈసీ. దర్యాప్తులో శాంతి భద్రతలు అదుపు తప్ఫడానికి కారణాలు ఏమిటి అన్న అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.