సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీ వెలువడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం వైసిపి కాంగ్రెస్ పార్టీలు వాటి నాయకులు బూతుల వారీగా పోలింగ్ సమాచారాన్ని సేకరించి అంచనాలు వేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నాయకులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. పోలింగ్ జరిగి నేటికీ 11 రోజులు అవుతుంది ఇంకా పార్టీ అభ్యర్థుల్లో ఏమాత్రం టెన్షన్ తగ్గలేదు. రకరకాల మార్గాల్లో ఓటింగ్ సరళిని అంచనా వేస్తున్నారు. అయితే కడప జిల్లాలో మాత్రం వైసిపిలో షర్మిల భయం పట్టుకుంది. ఎక్కడ ఎంపీ సీటుకు ఎసరు పెడుతుందని కలవరం మొదలైంది. ఈ విషయాన్ని వైసీపీలోని కీలక నేతలే అంటున్నారు.
పోలింగ్ తర్వాత షర్మిలాకు క్రాస్ ఓటింగ్ జరిగినట్లు వైసిపి వర్గాలు బలంగా భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో వారు ఒక అంచనాకు వచ్చారు ఇదే ఇప్పుడు ఎక్కడ కొంప కులుస్తుందని భయపడి పోతున్నారు ఈ సమస్య ఇప్పుడు వైసిపి నేతలను బాగా వేధిస్తుంది. ముఖ్యంగా కడప బద్వేలు పులివెందుల ప్రొద్దుటూరు నియోజకవర్గాలో పెద్ద ఎత్తున క్రాస్ ఓటింగ్ షర్మిలాకు జరిగిందని వైసిపి వర్గాలు బలంగా భావిస్తున్నాయి. కడప పార్లమెంటు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా భూపేష్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిలా రెడ్డి వైకాపా అభ్యర్థిగా అవినాష్ రెడ్డి పోటీ చేశారు జిల్లాలో షర్మిల రెండుసార్లు బస్సు యాత్ర చేశారు ఆమెకు తోడుగా డాక్టర్ సునీతా రెడ్డి వివేక సతీమణి సౌభాగ్యమ్మ ప్రచారం చేశారు. ప్రచారం చివరి రోజున మే 11వ తేదీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కడప బహిరంగ సభలో పాల్గొనడంతో కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది