తెలంగాణ రాజకీయం

లోకసభ ఎన్నికల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ కౌంటింగ్ కోరకు అన్ని ఏర్పాట్లు పూర్తి  అయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ పరిథిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు వరంగల్ యెనుమామూల మార్కెట్ యార్డ్ లో కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని,  స్టేషన్ ఘనపూర్ అసంబ్లీ సెగ్మెంట్  295 పోలింగ్ కేంద్రాలకు  17 టేబుల్లు,18 రౌండ్లు, పాలకుర్తి కు సంబంధించి 296 పోలింగ్ కేంద్రాలకు  17 టేబుల్స్, 18 రౌండ్లు, పరకాల కు సంబం ధించి 239 పోలింగ్ కేంద్రాలకు, సంబంధించి 14 టేబుల్లు,18 రౌండ్లు, వరంగల్ పశ్చిమ కు సంబంధించి 244 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుల్లు, 18 రౌండ్లు, వరంగల్ తూర్పు సంబంధించి 230 పోలింగ్ కేంద్రాలకు 14 టేబుల్స్, 17 రౌండ్లు, వర్ధన్నపేట కు సంబంధించి 279 పోలింగ్ కేంద్రాలకు16 టేబుల్లు, 18 రౌండ్లు, భూపాలపల్లి కు సంబంధించి 317 పోలింగ్ కేంద్రాలకు 18 టేబుల్లు, 18 రౌండ్ల ద్వారా కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్నికల సంఘం చే నియమించబడిన ఇద్దరు అబ్జర్వర్లు బండారి స్వాగత్ రణవీర్ చంద్, రాజేష్ కుమార్  కౌంటింగ్ ప్రక్రియలను పరిశీలిస్తారని తెలిపారు. కౌంటింగ్ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద సిఐపిఎఫ్ భద్రతా సిబ్బందితో పాటు స్టేట్ సాయుధ సిబ్బంది, ఎఆర్ ఫోర్స్, సివిల్ ఫోర్స్ ఉంటుందని, అలాగే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉంటుందని, పాస్  లేకుండా ఎవరూ అనుమతించబడదు అని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిథిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలియచేస్తూ కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.