జాతీయం రాజకీయం

మోడీలో మార్పు మంచిదేనా…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిపోయారు. ఒకప్పటి మోడీ వేరు.. ఇప్పుడు మోదీ వేరు. అప్పటి మోదీ ఎలా ఉండేవారు.. మోదీని ఇలా ఎప్పుడు చూసి ఉండరు. నిజానికి ఆయన ఏదైనా బహిరంగ సభల్లో పాల్గొంటే చాలా సీరియస్‌గా ఉంటారు. అందరికి వందనాలు చేసి.. చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోతారు. కానీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మాత్రం కాస్త డిఫరెంట్‌గా కనిపించారు. ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించారు. వేదికపై అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు. చంద్రబాబుతో ఫస్ట్‌ నుంచి లాస్ట్ వరకు ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు. ఆఖరికి కార్యక్రమం ముగిసిన తర్వాత అయితే మోదీ ఓ చిన్న పిల్లాడిలా మారిపోయారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. చిరంజీవితో ఓ ఫోటో దిగాలని కోరారు. దీనికి ఓకే చెప్పిన మోదీ.. పవన్‌ వెళ్లి మోదీని పిలిచేలోపే.. తానే వెళ్లిపోయారు. పవన్ కూడా లాక్కెళ్లిపోయారు. చిరంజీవి, పవన్‌తో స్పెషల్‌గా ముచ్చ టించారు. ముగ్గురు కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

సూపర్ స్టార్‌ రజనీకాంత్, ఆయన భార్య, బాలకృష్ణ, పళనీస్వామితో స్పెషల్‌గా ముచ్చటించారు. సో.. ఓవరాల్‌గా మోదీ కొత్తగా కనిపించారు. అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన మోదీకి చంద్రబాబు స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకే కారులో ప్రమాణస్వీకారోత్సవ ప్రాంగణానికి వచ్చారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్‌ ప్రొటోకాల్‌ను కూడా బ్రేక్‌ చేశారు మోదీ. ఇదంతా ఎందుకు చేశారు మోదీ.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అంటే మోదీకి ప్రత్యేకమైన అభిమానం ఉందా ? అందుకే వారిద్దరి కోసం ఇవన్నీ చేశారా ?రాజకీయాల్లో ఏదీ అనూహ్యంగా జరగదు. చేసే ప్రతి చర్య వెనక అర్థం, పరమార్థం వెరే ఉంటాయి. ఇందులో అటు మోదీ, ఇటు చంద్రబాబు ఆరితేరిన వారే.. అందుకే వీరిద్దరి అన్యోన్యమైన దోస్తి వెనక అసలు కారణం పొత్తు.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అవసరం మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుందంటారు. మరి ఇప్పుడు ఒకరి అవసరం మరొకరికి ఉంది. మరి ఇంత అవసరం ఉన్నప్పుడు ఈ మాత్రం అన్యోన్యత లేకపోతే కుదరదు కదా. అదే మనకు ఇప్పుడు ఇలా విజువల్‌గా కనిపిస్తోంది.

మోదీ కోణం నుంచి చూద్దాం. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఇప్పుడు అత్యంత కీలకమైన వ్యక్తి.. అందుకే ఆయనకు ఎట్‌మోస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు మోదీ. ఇక జనసేనాని పవన్ కల్యాణ్‌ కూడా ఈ లిస్ట్‌లోనే ఉన్నారు. అందుకే పవన్‌ను కూడా ఏమాత్రం తక్కువగా చూడటం లేదు మోదీ. అందుకే ఈ స్పెషల్ ఆలింగనాలు.. ప్రత్యేక అభివాదాలుకేవలం చంద్రబాబు, పవన్ మాత్రమే కాదు.. ఎన్నికల ఫలితాలు మెలువడిన మరుసటి రోజు నుంచి ఎన్డీఏ కూటమి నేతలతో మోదీ మాట్లాడే స్టైలే మారిపోయింది. ప్రతి ఒక్కరికి స్పెషల్ ఇంపార్టెన్స్‌ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరితో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ తరహా పద్ధతి మిగతా బీజేపీ నేతల వద్ద కనిపించడం లేదు. కేవలం మోదీ మాత్రమే ఈ స్టైల్‌ను ఫాలో అవుతున్నారు. కానీ అది కూడా తప్పదు కదా.. ఎందుకంటే మోదీ అంటే బీజేపీ.. బీజేపీ అంటే మోదీ అన్నట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ గ్యారెంటీ అన్నారు.. కానీ ఫలితాలు ఆశించినట్టుగా రాలేదు. సో.. ఇప్పుడు కూడా మోడీనే ఈ బాధ్యతలను మోయాల్సి వస్తుంది

ఏదేమైనా మోదీలో ఈమార్పు ఏపీకి చాలా మంచి చేసేదే అని చెప్పాలి. ఈ భయంతో కూడిన అభిమానం ఇలానే కొనసాగాలి. కేవలం పైపై షోలకు మాత్రమే పరిమితం కాకుండా.. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపు విషయంలో కూడా ఇదే తోడ్పాటును చూపించాలి. చంద్రబాబు, పవన్‌ కూడా ఈ అభివాదాలు, ఆలింగనాలు, ముచ్చట్లతో మురిసిపోవడంతో పాటు.. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు తీసుకురావాలి. రాష్ట్రానికి ఓ స్వర్ణయుగాన్ని తీసుకొచ్చినట్టే అని చెప్పాలి.