బ్రిటన్‌కు చెందిన అషాంటీ స్మిత్ విషాదాంతం
అషాంటీ స్మిత్ బ్రిటన్‌కు చెందిన యువతి వింతైన ఓ వ్యాధితో బాధపడుతూ ప్రాణాలను కోల్పోయింది . అరుదుగా రెండు కోట్ల మందిలో ఒకరికి కనిపించే హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా అనే జన్యుసంబంధ లోపంతో ఆమెకు 18 ఏళ్లకే వృద్ధాప్య లక్షణాలు చేరాయి. ఆమె 8వ ఏట ఈ వ్యాధితో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులు గుర్తించారు. ఏడాదికి 8 రెట్లు వయసు మళ్లిన లక్షణాలు వచ్చాయి. అషాంటీ 18 ఏళ్ల వయసులో తీవ్ర వృద్ధాప్య లక్షణాలతో అందరినీ విషాదంలో ముంచేసి మృతి చెందింది. తను మృతి చెందే వరకు విషాదాన్ని తనలోనే దాచుకుని , అందరినీ నవ్వించేది. పైగా తాను త్వరలోనే చనిపోతానని తెలిసి కూడా ఆమె ముఖంపై నవ్వు చెరగలేదని తల్లి లూయిస్ స్మిత్ తెలిపారు. ఆమె బీటీఎస్ సంగీతానికి అభిమాని అని, ఆమె అంత్యక్రియల్లో బీటీఎస్ సంగీతం వినిపిస్తామని తెలిపారమే. . తమ కుమార్తె జ్ఞాపకార్థం హచిసన్-గిల్ ఫోర్డ్ ప్రొగేరియా సిండ్రోమ్ తో బాధపడే వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించింది ఆ తల్లి.