రెండేళ్ల పాలనపై జరిగిన సమావేశంలో యడియూరప్ప ఉద్వేగం
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు యడ్యూరప్ప వెల్లడించారు. తన ప్రభుత్వ రెండేళ్ల పాలనపై బెంగళూరులో ఈరోజు జరిగిన సమావేశంలో యడియూరప్ప మాట్లాడుతూ.. తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మధ్యాహ్న భోజనం తర్వాత రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండాలని తనను అడిగారని… కానీ, తాను కర్ణాటకలోనే ఉంటానని ఆయనకు చెప్పానని అన్నారు. ఆ తర్వాత కర్ణాటలో బీజేపీ క్రమంగా బలం పుంజుకుంటూ వచ్చిందని చెప్పారు. తనకు ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంటుందని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ రెండేళ్లు కరోనాతోనే సరిపోయిందని అన్నారు. యడ్యూరప్పను పదవి నుంచి తప్పిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.