ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఓటమి ఇంటర్వెల్ మాత్రమే.. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి

ఈ ఎన్నికల్లో ఓటమి ఇంటర్వెల్ మాత్రమేనని వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. కోట్ల మంది ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మనదేనని, వయసుతో పాటు పోరాడే సత్తా తనకుందన్నారు. వైఎస్‌ఆర్‌సిపి విస్తృతస్థాయి సమావేశంలో మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. త్వరలోనే ప్రజలకు మరింత దగ్గరయ్యేలా పోరాటాలు చేస్తామని, మనల్ని నమ్ముకొని కొన్ని కోట్ల మంది ఉన్నారని, పార్టీ కార్యకర్తలకు మనం తోడుగా ఉండాలని, ఎన్నడూ లేని విధంగా వైసిపి కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్టీ తరఫున ఆదుకునే కార్యక్రమాలు చేస్తున్నామని జగన్ స్పష్టం చేశారు.

కేంద్రంలో టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చక్రం తిప్పుతున్నట్టుగా చూపుతున్నారని, ప్రత్యేకహోదా దిశగా ప్రయత్నించకపోవడం శిశుపాలుడి పాపాల్లో ఒకటి అని, ప్రత్యేక హోదా విషయంలో ఎపి ప్రజలకు బాబు ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. శిశుపాలుడిలా బాబు పాపాలు పండు తున్నాయన్నారు. ఎన్నికల్లో న్యాయంగా, ధర్మంగా గెలిచింది మనమేనన్నారు. నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశమే లేదని జగన్ పేర్కొన్నారు.